ఎమ్మెల్యే లాస్య నందినికి మూడుసార్లు వెంటాడిన ప్రమాదాలు….
రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు..ఎమ్మెల్యే గా కలిసిరాని కాలం..
1)లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడి….
2) నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి ప్రమాదం…
3) మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక. యువఎమ్మెల్యే మృతి…
హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి, ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ ఆమె కారుకు ప్రమాదం జరిగింది..






బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) మృతి చెందారు. పటాన్ చెరు సమీపంలో ఓఆరైర్పై ఆమె ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడిక్కకడే మృతి చెందారు. ఆమె కారు డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో లాస్య నందిత కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న అనారోగ్యంతో కన్నుమూయగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత కంటోన్మెంట్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్ కూతురు వెన్నెలపై 17,169 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఎమ్మెల్యే లాస్య నందినికి వెంటాడిన ప్రమాదాలు….
రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు..ఎమ్మెల్యే గా కలిసిరాని కాలం..
లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడి….
నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి ప్రమాదం…
మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక. యువఎమ్మెల్యే మృతి…
పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే కారు…




