spot_img
Thursday, August 6, 2026
spot_img

దేశవ్యాప్తంగా ఫేక్‌ డాక్యుమెంట్లతో సుమారు 21 లక్షల సిమ్‌ కార్డులు జారీ

దేశవ్యాప్తంగా ఫేక్‌ డాక్యుమెంట్లతో సుమారు 21 లక్షల సిమ్‌ కార్డులు జారీ అయినట్లు తమ విశ్లేషణలో తేలిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ తెలిపింది. ఈ మేరకు Airtel‌, MTNL, BSNL, JIO, Vodafone సంస్థలకు అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది. కొన్ని అనుమానాస్పద నంబర్ల జాబితాను విడుదల చేసి వాటి పత్రాలను తక్షణమే రీవెరిఫికేషన్‌ చేయాలని ఆదేశించినట్లు పేర్కొంది.రీవెరిఫికేషన్‌లో అవి బోగస్‌ ప్రూఫ్‌లని తేలితే సిమ్‌లను రద్దు చేయాలని DoT సూచించింది. సంచార్‌ సాతీ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 114 కోట్ల మొబైల్‌ కనెక్షన్‌లను డీవోటీకి చెందిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం విశ్లేషించింది. వాటిలో 21 లక్షల సిమ్‌కార్డులను యాక్టివేట్‌ చేసుకోవడానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించినట్లు గుర్తించింది.వాటిలో చాలా సిమ్‌లను సైబర్‌ నేరాలకు వాడుతున్నట్లు అనుమానిస్తోంది. ఇవి నిరూపితమైతే ఆ సిమ్‌ కార్డులను రద్దు చేయడంతోపాటు, వాటిని వినియోగించిన ఫోన్స్‌ కూడా పనిచేయకుండా చేస్తామని ఏఐ అండ్‌ డీఐయూ డైరెక్టర్‌ జనరల్‌ ముఖేశ్‌ మంగళ్‌ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 1.92 కోట్ల మంది తొమ్మిది సిమ్‌కార్డుల పరిమితికి మించి కనెక్షన్లు తీసుకొన్నారు. వారిలో చాలామంది సర్వీస్‌ ప్రొవైడర్లకు ఇచ్చిన డేటాలో తప్పులున్నాయి.అసలు వినియోగదారులకు తెలియకుండా వారి పేరిట తీసుకొనే సిమ్‌ కార్డులను గుర్తించి వాటిని రద్దు చేయించడానికి సంచార్‌ సాతీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయా నెంబర్లపై దర్యాప్తు సహా ఇతర చర్యలకు డీవోటీ ఇప్పటికే సర్వీస్‌ ప్రొవైడర్లకు డెడ్‌లైన్‌ విధించింది. వీటిని పూర్తిచేసే క్రమంలో భారీ సంఖ్యలో సిమ్‌కార్డులు డిస్‌కనెక్ట్‌ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ మొత్తం ఆపరేషన్‌లో ఏఐ అండ్‌ డీఐయూ సంస్థ ఇతర చట్ట సంస్థలతో కలిసి పనిచేస్తోంది.ఇప్పటివరకు 1.8 లక్షల మొబైల్‌ హ్యాండ్‌ సెట్లను పనిచేయకుండా చేశామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడు డీజీపీ శంకర్‌ జివాల్‌ మాట్లాడుతూ.. 90 శాతం సైబర్‌ నేరాలకు తప్పుడు సిమ్‌కార్డులనే వాడుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు తమను ట్రాక్‌ చేయడానికి వీల్లేకుండా వారు వీటిని వినియోగిసున్నారని తెలిపారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular