spot_img
Tuesday, March 24, 2026
spot_img

డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్‌ కాల్స్‌.. జాగ్రత్త!..X లో డైనమిక్  IPS ఆఫీసర్ సజ్జన్నార్ గారి హెచ్చరిక

ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ కాల్స్

*స్లీపర్‌ సెల్స్‌ నుంచి ప్రాణహాని అంటూ బెదిరింపులు

*ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్‌కు రూ.30 లక్షల కుచ్చుటోపీ

”హాలో.. మేం ముంబై క్రైం బ్రాంచీ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరుతో FedEx లో ఒక పార్శిల్‌ బుక్‌ అయింది. అందులో నకిలీ పాస్‌పోర్టులు, డ్రగ్స్‌ ఉన్నాయి. అంతేకాదు, మీకు ఉగ్రవాద మాస్టర్‌ మైండ్‌ అయిన మహ్మద్‌తో పలు బ్యాంకుల్లో జాయింట్‌ అకౌంట్స్‌ ఉన్నాయి. మీరు తీవ్రమైన కేసులో ఇరుక్కున్నారు.” అంటూ నకిలీ పోలీసుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ కాల్స్‌ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పార్శిళ్లలో డ్రగ్స్‌, తీవ్రవాదులతో బ్యాంక్‌ లావాదేవీలు చేశారంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ కోట్లలో కుచ్చుటోపీ పెడుతున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం పోలీసుల్లాగానే బిల్డప్‌ ఇస్తూ.. తమ ఐడీ కార్డులను, ఎఫ్‌ఐఆర్‌ కాపీలను పంపిస్తూ మోసాలకు తెగబడుతున్నారు.తాజాగా ఐఐటీ హైదరాబాద్‌ పీహెచ్‌డీ స్కాలర్‌కి ఫోన్‌ కాల్‌ చేసి అక్షరాల రూ.30 లక్షలను దోచేశారు. తను ఉగ్రవాదులతో కలిసి జాయింట్‌ అకౌంట్‌ తీశారని, అందులో అనుమానస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. తన లాప్‌ టాప్‌ను, ఫోన్‌ను ఉగ్రవాదులు హ్యాక్‌ చేశారని భయపెట్టారు. ఉగ్రవాద స్లీపర్‌ సెల్స్‌ తో తన కుటుంబానికి ప్రాణహానీ ఉందని, హౌజ్ అరెస్ట్ చేస్తున్నామంటూ చెప్పి 6 రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రాకుండా చేశారు. ఈ కేసులతో తనకేం సంబంధం లేదని చెప్పిన వినకుండా భయభ్రాంతులకు గురిచేశారు. జాయింట్ అకౌంట్‌లో అనుమానస్పద లావాదేవీలున్నాయని, వాటిని పరిశీలించాలని మాయమాటలు చెప్పారు. తన కుటుంబ సభ్యులు పొదుపు చేసుకున్న రూ.31 లక్షలను తమ బ్యాంక్‌ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. లావాదేవీలు సక్రమంగా ఉంటే ఆ నగదును తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. తర్వాత వారు స్పందించలేదు. చివరికి మోసపోయానని గుర్తించిన ఆ ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్‌.. సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నన్ను వ్యక్తిగతంగా కలిసి మోసపోయానని వాపోయారు. 

ఇలాంటి నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన ఉన్నత విద్యావంతలే.. మోసాలకు గురవడం బాధాకరం. అజ్ఞాత వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్శిళ్ల పేరుతో ఫోన్ కాల్స్ కానీ, ఐవీఆర్ కాల్స్ వస్తే వాటికి అసలే స్పందించవద్దు. వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దు. మీరు ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయండి. లేదా స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయండి. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular