spot_img
Tuesday, March 24, 2026
spot_img

సైబరాబాద్ SOT పోలీసులు రాజమండ్రి కి చెందిన యువకులైన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకుని 4.2 లక్షల విలువ చేసే MDM మత్తు పదార్థం స్వాధీనం

*సైబరాబాద్ SOT పోలీసులు రాజమండ్రి కి చెందిన యువకులైన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకుని 4.2 లక్షల విలువ చేసే MDM మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు.*

విశ్వసనీయ సమాచారం మేరకు *సైబరాబాద్ SOT మధాపూర్ టీం & మధాపూర్ పోలీసులు సంయుక్తంగా మాదాపూర్ PS పరిధిలోని చందా నాయక్ తండా, రాజా రెసిడెన్సీ సమీపంలో   *1) కాటూరి సూర్య కుమార్ మరియు 2) గుత్తుల శ్యామ్ బాబు* పట్టుకుని వారి వద్ద నుండి *4.2 లక్షల విలువ చేసే 28 గ్రాముల MDMA మత్తు పదార్థాన్ని* మరియు 02 మొబైల్ ఫోన్‌ లను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు *AP రాష్ట్రం రాజమండ్రికి చెందిన యువకులు.* వీరిలో కాటూరి సూర్య కుమార్ 2017 సంవత్సరంలో ఉన్నత చదువుల కోసం బెంగుళూరు వెళ్లి *జైన్ యూనివర్శిటీ లో B.Tech (కంప్యూటర్స్) పూర్తి చేసాడు*. ఆ మధ్య కాలం లో చెడు అలవాట్లకు అలవాటు పడి తన స్నేహితుల్లో ఒకరైన *అభి R/o బెంగళూరు. ద్వారా MDMA మతుపడార్థానికి బానిస గా మారాడు.*

*ఇతను మంచి ఉన్నత కుటుంబానికి చెందినవాడు. తండ్రి రైల్వే డిపార్ట్మెంట్ లో పెద్ద ఇంజనీర్. ఇతను విలాసవంతమైన జీవితాన్ని గడపాలని అనుకుని, అందుకు మరింత డబ్బు సంపాదించడానికి గత సంవత్సరం నుండి డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించాడు. గత సంవత్సరం డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటం తో సైబరాబాద్ లోని చందానగర్ పోలీస్ లు అరెస్టు చేసారు (Cr.No 791/2023, U/s 8c, R/w 22(c) 27, 29 of NDPS act). మూడు నెలలు జైలు లో గడిపి ఏ మాత్రం మారకుండా మళ్ళీ డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం ఆరంభించాడు.*

*బెంగుళూరులో ఉన్న స్నేహితుడు *అభి* ఒక ముఖ్యమైన డ్రగ్ స్మగ్లర్ నైజీరియన్ పేరు *గాడ్ ఆఫ్ సోల్మెన్* R/o బెంగుళూరు N/o నైజీరియా కంట్రీ, *(ఇతను బెంగుళూరులో గత రెండు సంవత్సరాలుగా ముఖ్యంగా విద్యార్థులకు డ్రగ్స్ సప్లై చేస్తుంటాడు)*. వాట్సాప్ మెసేజ్ ద్వారా పరిచయం చేశాడు.

*జైల్ నుండి బయటకు రాగానే  బెంగుళూరు వెళ్లి నైజీరియన్ డ్రగ్ స్మగ్లర్ ద్వారా MDMA ను కొనుగోలు చేసి తను సేవిస్తూ, తన చిన్ననాటి స్నేహితుడైన రాజమండ్రి చెందిన మరో B.tech విద్యార్థి అయిన గుత్తుల శ్యామ్‌ బాబు కు కూడా మత్తు మందు ను అలవాటు చేసి ఇతని ద్వారా రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు విక్రయిస్తున్నాడు.*

కొద్ది రోజులముందు 14.04.2024 న కాటూరి సూర్య కుమార్ బెంగళూరు వెళ్లి *గాడ్ ఆఫ్ సోల్‌మన్* నుండి *30 గ్రాముల MDMA* కొనుగోలు చేసి 16.04.2024న హైదరాబాద్ కు తిరిగి వచ్చి తన స్నేహితుడు గుత్తుల శ్యామ్‌ బాబుని హైదరాబాద్ కు పిలిపించుకొని ఇద్దరు కలిశారు. *వారిద్దరూ 2 గ్రాముల MDMA ను సేవించి, మిగిలిన 28 గ్రాముల డ్రగ్‌ ను రాజమండ్రిలోని విద్యార్థులకు విక్రయించాలని ప్లాన్ చేసుకున్నారు.*

దేశ వ్యాప్తంగా జరిగే ఎలక్షన్స్ సందర్భంగా అన్ని ప్రధానమైన రూట్ లలో పోలీసు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి చెక్ చేస్తుండడం తో డ్రగ్ రవాణా చేయడం కష్టంగా మారడంతో ఎక్కువ డబ్బులు సంపాదించే వచ్చు అనే ఆశ తో  *వారు MDMA ను గ్రాము కు రూ.10,000/- నుండి రూ.  15,000/- అమ్ముతున్నారు*

*వివరాలు*
1). *కాటూరి సూర్య కుమార్* S/o శేఖర్ బాబు Rly Sr Supdt, Age  22,  R/o పాతపేట, బొమ్మూరు, రాజమండ్రి రూరల్‌. AP .*(సరఫరాదారు & పెడ్లర్)*

2) *గుత్తుల శ్యామ్ బాబు,* S/o శ్రీనివాస్ (పోస్ట్ మాస్టర్), Age 22, Occ: Eng Student, R/o రైల్వే స్టేషన్ వెనుక వైపు, బాలాజీ పేట, రాజమండ్రి.

3) *గాడ్ ఆఫ్ సోల్‌మాన్* R/o బెంగళూరు N/o నైజీరియా *(ప్రధాన సరఫరాదారు – పరారీలో)*

*స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు*
*1).  MDMA – 28 గ్రా, విలువ రూ.  4,20,000/-*
*2)  మొబైల్ ఫోన్లు – 02 *(రూ. 1,50,000/-)*
*స్వాధీనం చేసుకున్న వాటి మొత్తం రూ.  5,70,000/-*

*మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.*

*ముఖ్యంగా విద్యార్థుల తల్లి తండ్రులకు సూచన* – మీ పిల్లల మీద దృష్టి సారించింది మత్తు పదార్థాలకు బానిస కాకుండా జాగర్తలు తీసుకోగలరు. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే సైబరాబాద్ పోలీసులకు తెలియ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular