సోషల్ మీడియా వచ్చాక సంబంధాల మధ్య దగ్గరి తనం పెరిగిపోయింది… ఎవరు ఎవరితో అయినా ఏమైనా చేయొచ్చు… దినికి తోడు సుప్రీం కోర్టు జ్జడ్జ్ మెంట్ కూడా వీళ్ళకి సపోర్ట్..ప్లేస్ కావాలి ఆంటే yoyo రూమ్స్ అందుబాటులో ఉన్నాయి..
ఎప్పటి నుండో వ్యభిచారం నీ లీగల్ చెయ్యాలి అని ఆ అఫిషియల్ వ్యభిచారానికి కొత్త కొత్త పేర్లు పెట్టీ పబ్లిక్ గానే చేస్తున్నారు..ఇప్పుడు వచ్చిన కొత్త కాన్సెప్ట్ ప్రియురాలు అద్దెకి ఇవ్వబడును అని వెబ్సైట్ లు యాప్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..ఇది విదేశాలకి మాత్రమే పరిమితం అయింది ఒక అమ్మాయి తాను ప్రియురాలిగా అద్దెకు వస్తాను ఆన్న కాన్సెప్ట్ అందరిలో ఆలోచన మొదలు పెట్టేలా చేసింది
ఒకప్పుడు కేవలం విదేశాలకు మాత్రమే పరిమితం అవుతుంది అనుకున్న కొన్ని కాన్సెప్టులు ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేస్తున్నాయి. విదేశాలలో అక్కడి పరిస్థితుల నేపథ్యంలో గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనే కాదు అమ్మని, నాన్నని, అక్కని చెల్లిని ఇలా ఏ రిలేషన్ ను అయినా అద్దెకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో గర్ల్ ఫ్రెండ్ ని అద్దెకిచ్చే సంస్థలు ఇంకా మొదలవలేదు కానీ కొంతమంది ఔత్సాహిక యువతులు తమకు తాము ఒక రెంట్ ఫిక్స్ చేసుకుని డేట్ కి సిద్ధమవుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా దివ్య గిరి అనే ఒక యువతి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మీరు సింగల్ గా ఉన్నారా? అయినా డేట్ కి వెళ్లాలనిపిస్తోందా? అయితే నన్ను మీ డేట్ కోసం అద్దెకి తీసుకోండి అంటూ ఆమె రాసుకొచ్చింది.
అంతేకాదు తనని ఒక రోజు మొత్తానికి అద్దెకి తీసుకుని కొన్ని అద్భుతమైన మెమరీస్ క్రియేట్ చేసుకోమని చెబుతోంది. అంతేకాదు తన అద్దెకు సంబంధించిన రేట్ కార్డు కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాని ప్రకారం కాఫీ డేట్ కి అయితే 1500, నార్మల్ డేట్ అంటే డిన్నర్ తో కలిపి మూవీ చూడటం 2000, కుటుంబంతో కలవడం 3000, ఏదైనా ఈవెంట్ కి కలిసి వెళ్లడం 3500, బైక్ డేట్ అంటే చేతులు పట్టుకోవడం వరకు 4000, సోషల్ మీడియాలో డేటింగ్ గురించి పోస్ట్ పెడితే 6000. అలాగే ఏదైనా అడ్వెంచర్స్ చేయాలంటే రోజు మొత్తానికి 5000, ఇంట్లో కలిసి వంట వండుకుని తినడానికి 3500, షాపింగ్ కలిసి చేయడానికి 4500, వీకెండ్ గెట్ అవే అంటే ఇద్దరు కలిసి ఏదైనా ప్రదేశానికి వెళ్లాలనుకుంటే 10000. ఇలా ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క రేటు కూడా ఆమె ఫిక్స్ చేసింది. అయితే ఇది నిజమా లేక సోషల్ మీడియా అటెన్షన్ కోసం ఆమె చేసిన విషయమా అనే దాని మీద క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.