spot_img
Thursday, August 6, 2026
spot_img

బాత్రూంల్లో సీక్రెట్ కెమెరాలు.. 13వేల నగ్న వీడియోలు : పోలీసులకు పట్టించిన భార్య

usaపేరుకు డాక్టర్.. కానీ చేసేదేమీ నీచపు పని.. అమెరికాలో చిన్నారులు, మ‌హిళ‌ల న‌గ్న చిత్రాల‌ను రికార్డ్ చేస్తున్న ఓ భార‌తీయ వైద్యుడిని అత‌ని భార్య పోలీసుల‌కు ప‌ట్టించింది. ఆస్పత్రి గ‌దులు, బాత్రూంల్లో ర‌హ‌స్య కెమెరాలతో చిత్రాలు, వీడియోలు రికార్డు చేయడ‌ంతో ఉమేర్ ఏజాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక్క హార్డ్ డ్రైవ్ లోనే 13వేల వీడియోలను గుర్తించారు. ఎంతో మంది మహిళలతో చేసిన లైంగికచర్యల వీడియోలనూ అతను రికార్డు చేసినట్టు ఒక్లాండ్ కౌంటీ అధికారి తెలిపారు. రికార్డు చేసిన వీడియోలను అతడు తన ఇంట్లోని కంప్యూటర్, ఫోన్లతోపాటు 15 ఎక్స్‌టర్నల్ స్టోరేజీ డివైజ్‌లలో భద్రపరిచాడు. అంతేకాకుండా క్లౌడ్ స్టోరేజీలోనూ వీడియోలను అప్‌లోడ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నాడు.

2011లో వర్క్ వీసాపై ఇండియా నుంచి అమెరికా వెళ్లిన ఒయిమెయిర్ ఎజాజ్ అలబామాలో కొన్నేళ్లపాటు ఉన్నాడు. 2018లో మిషిగాన్‌కు మారాడు. అక్కడ పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే పనిచేసే ప్రతీచోట రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళల నగ్న వీడియోలను షూట్ చేసేవాడు. అలా వాటిని రికార్డు చేసేవాడు. మహిళా రోగులు స్పృహలో లేనప్పుడు వారితో అసభ్యంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను కూడా రికార్డు చేసేవాడు. అయితే ఈ విషయం అతని భార్యకు తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ కోసం ఇంటిని సోదా చేసిన పోలీసులకు ఈ వీడియోలు బయటపడ్డాయి. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular