హోటల్‌కు వచ్చిన జంటలను సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నాడు ఓ హోటల్ యజమాని. ఇందుకు సంబంధించి బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హోటల్ సితా గ్రాండ్‌ను నిర్వహిస్తున్నాడు యజమాని గణేష్. అయితే, హోటల్ పరిసరాల్లో ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాలను అన్ని రూమ్‌లలో సీక్రెట్ కెమెరా అమర్చాడు. హోటల్లో దిగిన కస్టమర్ల అశ్లీల వీడియోలు చిత్రీకరించి వాటిని మొబైల్ ఫోన్‌లో వేసుకుని వారికి చూయించి బ్లాక్ మెయిల్‌కు దిగాడు. ఈ క్రమంలోనే ఓ జంట కంటపడింది సీక్రెట్ సీసీ కెమెరా. దీంతో సదరు హోటల్ నిర్వహకులను నిలదీయడంతో యాజమాని గణేష్ అసలు యవ్వారం వెలుగులోకి వచ్చింది.
దీంతో చేసేదీ లేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోటల్ సితా గ్రాండ్ వద్దకు చేరుకున్న పోలీసులు యజమాని గణేష్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.




