సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మూలాలు కదిలాయ్… ఇక రాజకీయ భవిష్యత్తు కూలిపోయినట్లే.. గతంలో హిందూపురం ఎం.పీ గోరంట్ల మాధవ్ చేష్టలు చూసి ఆ పార్టీ అధినేత పెద్దగా పట్టించుకోలేదన్నది వాస్తవం. అప్పట్లో అనుకూల అధికారుల చేత అదొక మార్ఫింగ్ వీడియో అనే చెప్పేసి దులుపుకోవచ్చు.. చేసింది ఎదవ పని.. పైగా దానికి కూడా కవరింగ్ కారణాలు చెప్పించారు. ..అప్పుడైతే చెల్లందిగానీ ఇప్పుడు అవన్నీ నడవవు..
—
ఆనాడు మాధవ్ అయినా…నేడు ఆదిమాలం అయినా ఆ పార్టీ తాను ముక్కలే అన్నది నిజం.. కాకపోతే పార్టీ మారి ఆదిమూలం కాస్తా ఎమ్మెల్యే అయ్యాడంతే… ఆ పార్టీ తాలూకు వాసనలు., ఆ పార్టీ తాలూకు చేష్టలు ఎట్టాపోతాయి…అని జనం అనుకుంటూ ఉన్నారు., కాకపోతే ఆ పార్టీ వాళ్లయితే దీనినీ మార్ఫింగ్ అనీ., వీడియో ఎడిటింగ్ అనీ., అదేదో వీడియోను మార్చి ఇలా తయారు చేశారనీ అస్మదీయ అధికారుల చేత చెప్పించి ., సిగ్గూ శరం లేకుండా ప్రెస్ మీట్ లు పెట్టించే వాళ్లు. కానీ, నేడు ఓ పెద్దాయన., సి.ఎం గా ఉన్నారు కాబట్టి, సదరు ఎమ్మెల్యే ను వెంటనే సస్పెండ్ చేశారు..
—–
రాజకీయాలలో ఇలాంటి చిత్త కార్తె ..క్కలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మహిళలను వంచించి. బెదిరించి లొంగదీసుకోవడం క్షమించరాని నేరం. మహిళా ఉద్యోగులనూ., తమ వద్దకు సాయం కోసం వచ్చిన మహిళలనూ అంగడి వస్తువుగా చూసే కామంధులకు ఈ మహిళ గుణపాఠం చెప్పంది. తన పడిన నరకయాతన మరొకరు పడరాదనీ., ఇలాంటి కామాంధులకు గుణపాఠం చెప్పాలనీ., ఆమె., తాను నలిగిపోతూ., నరకం అనుభవిస్తూ ఆ బాధను కెమెరా లో బంధించింది.. దానిని తన భర్తకు అప్పగించి నిర్మలహృదయమూర్తిగా నిలిచింది. ఇలా ఆమె., అమె భర్త చూపిన తెగువనూ., ఆత్మస్థైర్యాన్నీ మనసున్న మనుషులంతా అభినందిస్తున్నారు. ఆమెకూ,., ఆమె భర్తకూ హ్యాట్సాఫ్
కామాంధులకు చెంపదెబ్బ ఈ కపుల్… హ్యాట్సాఫ్ మీకు…
RELATED ARTICLES