: ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డు. అయినా సరే ఆ కీచకుడికి ఏమీ అనిపించలేదు. మాయమాటలు చెప్పి తీసుకొచ్చిన మహిళపై ఫుట్ పాత్ పైనే బలాత్కారం చేశాడు.సమాజం ఎరిపోతోంది రాత్రి పగలు.కు తేడా లేకుండా పోతుంది..సభ్య సమాజం తలదించుకునే ఘటన..
అతను అత్యాచారం చేస్తున్నట్లుగా కళ్ల ముందు కనిపిస్తున్నా.. ఎవరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. పైగా .. అందరూ ఫోన్లు తీసుకుని షూట్ చేయడం ప్రారంభించారు. తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో ఈ ఘోరం జరిగింది.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో ఓ మహిళపై ఓ వ్యక్తి రోడ్డుపై అత్యాచారం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతని పేరు లోకేష్ అని.. బలాదూర్‌గా తిరికే వ్యక్తి చెత్త ఏరుకునే అమ్మాయిని ట్రాప్ చేశాడని గుర్తించారు. మద్యం అలావాటు చేసి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వెంట తిప్పుకుంటున్నాడు.అగార్ నఖా ఏరియాలో ఆమె చెత్త ఏరకుంటున్న సమయంలో అక్కడకు వచ్చిన లోకేష్ ఆమెను బలవంతంగా వివస్రను చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను ఆ అమ్మాయిని రేప్ చేస్తున్నాడని తెలిసినా ఒక్కరు కూడా ఆపలేదు.
నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు
అత్యాచారం చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులు అరెస్టు చేశారు. మహిళను పునరావస కేంద్రానికి పంపించారు. కోర్టు రేపిస్టుకు రిమాండ్ విధించింది. ఈ అంశంపై మధ్యప్రదేశ్ ప్రబుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి.




