spot_img
Monday, June 22, 2026
spot_img

సిలికాన్‌ సిటీలో మరో హనీట్రాప్‌ దందా

సిలికాన్‌ సిటీలో మరో హనీట్రాప్‌ దందా బయటకు వచ్చింది. సినిమా నిర్మిద్దామని నమ్మించి ఓ వ్యాపారి నుంచి సుమారు రూ. 40 లక్షలను తీసుకొని, అతనిని హనీట్రాప్‌ చేసిందో ముఠా.బాధితుడు హైగ్రౌండ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు గణేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కావ్య, దిలీప్‌, రవికుమార్‌ అనేవారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. గణేశ్‌కు ఎంజీ రోడ్డులో ఆర్ట్‌ స్టూడియో ఉంది. ఓ సోషల్‌ మీడియా యాప్‌లో కావ్య పరిచయం అయ్యారు. ఈమె గత నాలుగు పంవత్సరాల క్రితం సినిమా చేస్తున్నట్లు చెప్పింది. దర్శకుడు ఎస్‌.ఆర్‌.పాటిల్‌ అని, సినిమా కోసం రూ. 4.25 లక్షలు కావాలని గణేశ్‌ నుంచి తీసుకుంది.డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే, కావ్య గొట్టిగెరె వద్దకు గణేశ్‌ను పిలిపించి సన్నిహితంగా గడిపి వీడియోలు తీసుకుంది. ఆ తరువాత వీడియోలు చూపించి కేసు పెడతానని, సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని బెదిరింపుకు గురి చేసింది. గణేశ్‌ ద్వారా ఓ స్కూటర్‌ను కొనిపించుకుంది. బెదిరించి బంగారు గొలుసు, బ్రాస్‌లెట్‌ను తీసుకుంది. దశలవారీగా తనను రూ. 40 లక్షల వరకూ లూటీ చేసినట్లు, మిగతావారు ఆమెకు సహకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular