spot_img
Sunday, July 20, 2025
spot_img

ఎన్టీఆర్ కోసం అప్పట్లో కృష్ణ పేపర్ ప్రకటన ఎందుకిచ్చాడో తెలుసా.. వారిద్దరి మధ్య అసలేం జరిగింది..?(ఓల్డ్ గాసిప్)

టాలీవుడ్ లో మొదటితరం హీరోలుగా ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలు పోటాపోటీగా నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్ మధ్య పోటీ ఉండేది.కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ పై చేయి సాధిస్తే మరికొన్ని సందర్భాల్లో కృష్ణ మరిన్ని సందర్భాల్లో ఏఎన్నార్ పై చేయి సాధించేవారు. ఒకనొక సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టి తక్కువ సమయంలోనే సీఎం అయి సంచలనం సృష్టించారు. సూపర్ స్టార్ కృష్ణ స్వతహగా ఎన్టీఆర్ అభిమాని. ముఖ్యంగా తెనాలి రత్న థియేటర్లో చూసిన పాతాళ భైరవి సినిమా కృష్ణ మనసులో చెరగని ముద్ర వేసింది.

నటుడిగా ప్రయత్నించడానికి చెన్నై వెళ్ళినప్పుడు కృష్ణ తొలుత ఎన్టీఆర్ నే కలిసారట. అయితే కృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీల్లో ఈనాడు ఒకటి. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ఈనాడు సినిమాకు ఇది రీమెక్‌గా తెరకెక్కింది. మొదట ముత్యాల ముగ్గు శ్రీధర్ హీరోగా ఈ సినిమాను చేయాలని భావించారు. అదేవిధంగా పి.సాంబశివరావును దర్శకుడిగా ఎంపిక చేసి పరుచూరి బ్రదర్స్‌కు అప్పగించారు. కానీ ఈ సినిమాలో కృష్ణ హీరోగా నటిస్తే బాగుంటుందని పరుచూరి బ్రదర్స్ దర్శకుడికి చెప్పారటఅదేవిధంగా కృష్ణ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే విధంగా మార్పులు చేసి మాటలు రాసుకున్నారట పరుచూరి బ్రదర్స్‌. అలా కృష్ణ 200వ సినిమాగా ఈనాడు తెరమీదికి వచ్చింది. 1982 డిసెంబర్ 17న విడుదలై సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో కృష్ణ సైకిల్ తొక్కుతూ పాడే పాట ఆ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా పాటను చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్‌కు మద్దతుగా కృష్ణ ఈ పాటలో నటించారని అప్పట్లో భావించారు. సరిగ్గా ఈనాడు సినిమా విడుదలైన రెండు వారాల తరువాత టీడీపీ విజయం సాధించింది. దీంతో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్‌ను అభినందిస్తూ.. కృష్ణ ఓ పేపర్‌లో యాడ్ కూడా వేశారు. అది అప్పట్లో సంచలనమనే చెప్పాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular