spot_img
Friday, June 26, 2026
spot_img

ఎంఎల్‌ఎం సంస్థల దందాకొత్త ఎత్తులతో రూ.కోట్లు స్వాహా

గొలుసుకట్టు దందాతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మల్టీలెవల్‌ మార్కెటింగ్‌(ఎంఎల్‌ఎం) సంస్థలు ప్రజల జేబులను కొల్లగొడుతున్నాయి. సీనియర్ IPS ఆఫీసర్ సజ్జన్నార్ ఇలాంటి గ్యాంగ్ లను ఏంటో మందిని పట్టుకొని కోర్టు మెట్లు ఎక్కించాడు..అధిక వడ్డీలు వస్తాయన్న ఆశతో ఎంతో మంది అమాయకులు డబ్బులు పెట్టుబడిగా పెట్టి సర్వం కోల్పోతున్నారు. మొదట అత్యాశతో గుడ్డిగా నమ్ముతున్నారు.. ఆ తర్వాత సంస్థ బోర్డు తిప్పేయడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆర్‌జీఏ యాప్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారు ఇటీవల సూర్యాపేట జిల్లాకేంద్రంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వెలసిన ఎంఎల్‌ఎం సంస్థలు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.ఇలాంటి గొలుసుకట్టు వ్యాపారాలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి మోసాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అధిక శాతం వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికి.. కొద్ది రోజులపాటు సక్రమంగా చెల్లింపులు చేయడంతో వాటిని చూసి గుడ్డిగా మోసపోతున్నారు. కావల్సిన సొత్తు సమకూరిన తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. పదేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పీషోను అనే సంస్థ సుమారు రూ.450 కోట్లతో ఉడాయించిన విషయం విదితమే.

ఆ తర్వాత ఇలాంటి ఎన్నో సంస్థలు వెలిసి అమాయకుల డబ్బులను కొల్లగొట్టాయి. వీటిలో కొన్ని వెలుగుచూసినవి ఉన్నాయి.. మరికొన్ని సంస్థలు బయటకు పొక్కకుండానే బోర్డు తిప్పేశాయి. ఇలాంటి సంస్థల్లో చిక్కుకొని మోసపోతున్న వారిలో మధ్య తరగతి, నిరుపేదలే అధికంగా ఉండటం గమనార్హం. ఇలాంటి మోసాలపై పోలీసులు నిఘా పెట్టి ప్రారంభంలోనే ఆయా సంస్థలపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.గొలుసుకట్టు వ్యాపారుల మాయమాటలు నమ్మొద్ధు అధిక వడ్డీలు చెల్లిస్తామని ఆశ చూపితే గుడ్డిగా పెట్టుబడులు పెట్టి చాలామంది మోసపోతున్నారు. గతంలోనూ పలు సంస్థలు ప్రజలను మోసం చేశాయి. వీటితోనైనా గుణపాఠం నేర్చుకోవాలి. డబ్బులు పెట్టుబడిగా పెట్టాలంటే ప్రభుత్వ సంస్థలనే ఎంచుకోవాలి. గొలుసుకట్టు సంస్థలపై సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలి అని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular