spot_img
Thursday, February 5, 2026
spot_img

నాపై వచ్చిన ఆరోపణలు అసత్యం : యూట్యూబర్ హర్ష సాయి..విడియో తో

విదేశాలలో ఉన్న యూట్యూబర్ హర్షసాయి ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యేక్షమయ్యాడు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమన్నారు. తాను కథ రాసి తీసిన కు వాళ్లు కాపిరైట్స్ అడగడం ఏంటని ప్రశ్నించారు.

తాను ఎక్కడ ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు హర్షసాయి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు.. ఇప్పుడు అదే జరిగిందన్నారు. కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేశారని.. కానీ పోలీసుల విచారణలో నిజానిజాలు బయటికి వచ్చేయి కాబట్టే ఈ రోజు తనకు కోర్ట్ బెయిల్ ఇచ్చిందన్నారు హర్షాసాయి.విదేశాల్లోనే ఉన్న హర్షసాయి తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమయ్యాడు. తనపై నమోదైన కేసుకు సంబంధించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. నాపై కావాలనే తప్పుడు ప్రచారం చేశారు. నేను తీసిన సినిమాకు వాళ్లే కాపీరైట్స్‌తో పాటు రూ. 2 కోట్లు ఇవ్వాలని అడిగారు. నేను ప్రజలకు అయితే ఇస్తాను కానీ ఇలా బ్లాక్ మెయిల్ చేసేవారికి అసలే ఇవ్వను. నిజాలు బయటకొచ్చాయి కాబట్టే నాకు బెయిల్ వచ్చింది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు.. అదే జరిగింది అంటూ హర్షసాయి వెల్లడించాడు.

సెప్టెంబర్‌ నెల 24న ఓ యువతి హర్షసాయిపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించింది. రూ.2 కోట్ల రూపాయలు సైతం తీసుకున్నాడని ఫిర్యాదులో చెప్పింది. దీంతో హర్షసాయిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి హర్షసాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏ క్షణమైనా అరెస్ట్ అవుతాడన్న ప్రచారం సాగుతుండగా.. హైకోర్టు అతడికి బెయిల్ ఇచ్చింది. దీంతో కొన్నాళ్లుగా విదేశాలలో ఉన్న హర్ష సాయి ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక్షమయ్యాడు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమన్న హర్షసాయి నిజాలు బయటకొచ్చాయి కాబట్టే కోర్టు తనకు బెయిల్ ఇచ్చిందన్నాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular