spot_img
Wednesday, March 25, 2026
spot_img

కోర్టు తీర్పులను విమర్శించే హక్కు మీడియాకుంది సుప్రీంకోర్టు

కోర్టులు ఇచ్చే తీర్పులను నిష్పక్షపాతంగా విమర్శించే హక్కు మీడియాకు ఉందని సుప్రీంకోర్టు
స్పష్టం చేసింది.

రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కైన భావప్రకటనా స్వేచ్ఛలో ఇది భాగమేననితెలిపింది.

తీర్పులను సహేతుకంగా విమర్శించటంనేరం కాదని, అదొక హక్కని పేర్కొంది.

న్యాయమూర్తులతో సహా ఎవరూ లోపరహితులు కాదని… సద్విమర్శలను ప్రోత్సహించాలని తెలిపింది.

కేంద్రమానవవనరుల మంత్రి కపిల్ సిబాల్, ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా,ఆ పత్రికా విలేకరిలపై దాఖలైన కోర్టు ఉల్లంఘన కేసుపై శుక్రవారం విచారణ జరిపిన
సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది.

1995లో న్యాయవాదిగా ఉన్న సిబాల్..న్యాయవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై టైమ్స్ఆఫ్ండియాలో ఒకవ్యాసం రాశారు.
దానిపై కోర్టు ఉల్లంఘన కేసు నమోదైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular