spot_img
Sunday, July 20, 2025
spot_img

యాంకర్‌ ప్రదీప్‌ సీక్రెట్ లవ్ స్టోరీ.. త్వరలో ఏపీ ఎమ్మెల్యేతో పెళ్లి?

Filmi beat కధనం ఆధారంగా

సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ, పెళ్లిలు కామన్ అన్న విషయం తెలిసిందే. అయితే.. సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని సక్సెస్ లు కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి..సెలబ్రెటీ కాబట్టి అందరూ ఆసక్తి గా చూస్తారు..ఎక్కువ సీక్రెట్ గా కథ నడిపించాలి అని చూస్తారు ..కానీ ఎక్కడో చోట దొరికిపోయారు.సెలబ్రెటీలు ఇండస్ట్రీలోని ఉన్నవారితోనే కలిసి ఉంటే.. మరికొందరూ బయటి వారితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో కొందరు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకొని వెళ్తే .. మరి కొందరు మాత్రం నచ్చినన్ని రోజులు కలిసి తిరిగి.. తర్వాత వేరే వారిని చూసుకుంటారు. గతంలో ఎంతోమంది ప్రేమ పెళ్లిల్లు కూడా చేసుకున్నారు. జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే.. తాజాగా ఓ బుల్లితెర స్టార్ యాంకర్, హీరో ఏకంగా ఏపీ ఎమ్మెల్యేతోనే ప్రేమాయణం సాగిస్తున్నారంట… ఓ సెలబ్రెటీ బ్యాచిలర్ లైఫ్ బద్దలు అయ్యే స్టోరి ఏంటో తెలుసుకుందామా.

బుల్లితెర రారాజు ప్రదీప్‌ మాచిరాజు. యాంకర్ ప్రదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు,మరి ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.తొలుత ఆర్జేగా తన కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ .. ఆ తరువాత యాంకర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాడు. మొదటి షో తోనే బాగా పాపులర్ అయ్యాడు ప్రదీప్. ఆ తర్వాత తాను చేసే ప్రతి షోకు క్రేజీ పెంచుకున్నారు. యాంకరింగ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ప్రదీప్ మాచి రాజు. మేల్‌ యాంకర్‌ల్లో ప్రదీప్‌కు ఉన్న క్రేజ్ మామూలు గా కాదు. మెయిన్ గా యూత్ ఆయన యాంకరింగ్ అంటే.. పడిపడి నవ్వుతారు.

ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై సంపాదించుకున్న ఫేమ్ తో వెండితెరపై కూడా అడుగుపెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ.. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ’30 రోజుల ప్రేమకథ’ సినిమాతో హీరోగా మారారు ప్రదీప్ మాచిరాజు. అలాగే.. పలు షోలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కెరీర్ పరంగా బాగా బిజీ అయ్యాడు. ఇప్పటికే హీరోగా ఓ మూవీ చేయగా మరో సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఆ మూవీకి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన యంగ్ హీరోయిన్ గా జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి నటిస్తోంది.మొత్తానికి ఇటు యాంకర్ గా.. అటు హీరోగా మంచి స్పీడ్ లో ఉన్నారు ప్రదీప్. కెరీర్ పరంగా బిజీబిజీగా ఉన్న ఈ స్టార్ యాంకర్ ప్రదీప్ కు ఎప్పుడు ఎదురయ్యే ప్రశ్న.. పెళ్లి ఎప్పుడు? ఎందుకంటే.. నాలుగుపదుల వయసు వచ్చిన ప్రదీప్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే.. తాజాగా ప్రదీప్ మాచిరాజు పెళ్లిపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే మనోడు సీక్రెట్ లవ్ ఎఫైర్ నడుపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రదీప్ మాచిరాజు.. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమికి చెందిన ఎమ్మెల్యేతో దాదాపు రెండేళ్ల నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్నరంట. ఆ ఎమ్మెల్యే విదేశాల్లో ఉన్నత చదువులు చదివారంట. అయితే.. ఏపీలో బడా రాజకీయ కుటుంబానికి చెందిన ఆమె.. చదువుల తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారంట. అంతేకాదు.. పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా గెలుపొందిందట. ఆ ఎమ్మెల్యే కూటమి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారట. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఎమ్మెల్యేకు.. బుల్లి తెరపై బిజీగా ఉంటే ఈ యాంకర్ కు ఎలా కుదిరిందని, వారి వీరి ప్రేమాయణానికి శుభం కార్డు వేసి.. ఎప్పుడూ మూడు మూళ్ల బంధంతో ఒక్కటవుతారనే ఆసక్తిగా చూస్తున్నారట ఫ్యాన్స్. కథ కంచికి చేరుతుందా మధ్య ఆగిపోతుందా అని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular