పెద్దపల్లి జిల్లాకు చెందిన గాయత్రి (Gayatri) ఏపీలో జూనియర్ సివిల్ జడ్జి(Junior Civil Judge)గా ఎంపికయ్యారు. జూలపల్లి మండలం వడ్కాపూర్ కు చెందిన మొగురం మొండయ్య-లక్ష్మి దంపతుల కుమార్తె గాయత్రి..వరంగల్లోని కాకతీయ వర్సిటీలో ‘లా’ చదివారు. అనంతరం పీజీ లా కామన్ ఎంట్రన్స్లో నాలుగో ర్యాంక్ సాధించి ఉస్మానియాలో ఎల్ఎల్ఎం అభ్యసించారు. ఇటీవల ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పరీక్షల ఫలితాల్లో ఆమె ఎంపికయ్యారు. మొండయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు గాయత్రి ఉన్నారు.తండ్రి వ్యవ సాయ కూలీగా గ్రామంలోనే పనిచేస్తున్నారు. కూతురిని కాకతీయ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, ఉస్మానియాలో ఎల్‌ఎల్‌ఎం చదివించారు.ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పోటీ పరీక్షలకు తొలిసారి హాజరైన గాయత్రి.. అప్పుడు విజయం సాధించలేకపోయారు. రెండోసారి పరీక్ష రాసిన గాయత్రి.. ఈనెల 27న వెలువడిన ఫలితాల్లో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. పట్టుదలతో చదివిన ఆమె రెండోసారి పరీక్షలు రాసి తన లక్ష్యం సాధించారు. కాగా, మొండయ్య ఇద్దరు కుమారులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సివిల్ జడ్జిగా గాయత్రి ఎంపిక కావడం పట్ల వడ్కాపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో తెలంగాణ యువతి అలేఖ్య సత్తా చాటింది. అలేఖ్య(24) ఫస్ట్ ర్యాంకు సాధించి సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న తల్లి మాధవీలతను స్ఫూర్తిగా తీసుకుని తానూ జడ్జి కావాలనుకున్నారు. ఈ క్రమంలో గత ఏడాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నియామకాల్లో ఫస్ట్ ర్యాంకులో నిలిచి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఆమెను రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దీకొండ రవీందర్, ప్రధాన కార్యదర్శి పట్టోళ్ల మాధవరెడ్డి అభినందించారు.
ఏపీలో జడ్జిగా తెలంగాణ యువతి..
RELATED ARTICLES