spot_img
Tuesday, March 24, 2026
spot_img

కిలేడీ వలపు వలకు బలైన ఎస్సై హరీశ్‌?

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ములుగు జిల్లా వాజే డు ఎస్సై రుద్రారపు హరీశ్‌ (29) ఆత్మహత్య ఘటన నిగ్గు తేల్చేందకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.కీలక మైన విషయాలు తెలుసుకున్నారు.

వివరాల్లోకి వెళితే…ముళ్లకట్ట అంతర్రాష్ట్ర వంతెన పక్కనే ఉన్న ప్రైవేట్‌ రిసార్టులో ఎస్సై హరీశ్‌ సోమవారం ఉదయం తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గదిలో ఓ యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రక్తపు మడుగులో విగతజీవి గా ఉన్న హరీశ్‌ మృతదేహంపై ఓ యువతి పడి రోదించిన ఫొటో లు, వీడియోలు వైరల్‌ అయ్యాయి.

ఘటన అనంతరం పేరూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. సంఘటన ఎలా జరిగింది? ఆ సమయంలో అక్కడ ఆమె ఎందు కు ఉందనే అంశాలపై విచారించారు. ఈ క్రమంలో పలు విస్తుపోయే విషయాలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఆ యువతి సూర్యాపేట జిల్లా వాస్తవ్యురాలిగా గుర్తించారు. అక్కడి పోలీసులను సంప్రదించగా సదరు యువతి గతంలో ముగ్గురు యువకులకు ప్రేమపేరుతో దగ్గరై పెళ్లికి ఒత్తిడి చేసి వారు ఒప్పుకోకపోవడంతో కేసులు పెట్టించినట్లు తేలింది. ఈమె వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అతడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదైనట్లు సమాచారం. సమాజంలో పలుకుబడి, ఆర్థికంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని లొంగదీసుకోవడమే పనిగా పెట్టుకున్న ఆ యువతి ఏడాది క్రితం ఎస్సై హరీశ్‌కు ఫోన్‌లో కాంటాక్ట్‌ అయినట్లు సమాచారం.

ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు దారితీసిందని, అయితే ఆమె గురించి అసలు విషయాలు తెలియడంతో ఆమెతో పెళ్లికి హరీశ్‌ నిరాకరించాడని సమాచారం. ఈ క్రమంలోనే హరీశ్‌ కుటుంబసభ్యులు చూసిన సంబంధాన్ని చేసుకునేందుకు అంగీకరించాడని, కానీ తనను పెళ్లి చేసుకోకుంటే రోడ్డుకీడుస్తానని, ఇప్పుడు తాను గర్భవతినని సదరు యువతి హరీశ్‌ను భయపెట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన ఎక్కడ పరువుపోతుందోననే బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎస్సై హరీశ్‌ మృతిపై తొలుత అనేక ఊహాగానాలు వినిపించాయి. ఉన్నతాధికారుల వేధింపులు, పని ఒత్తిడి అంటూ ప్రచారమైంది.ఆయన మరణానికి దారి తీసిన పరిస్థితులను నిగ్గుతేల్చేందుకు పోలీసు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట యువతి అసలు బండారం బయటపడింది. కాగా, ఆ యువతిని సోమవారం సాయంత్రమే ఇద్ద రు మహిళా కానిస్టేబుళ్లను ఎస్కార్ట్‌గా ఇచ్చి దూద్యా తండాకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుశాఖలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న హరీశ్‌ జీవితం విషాదంగా ముగిసిపోవడం కుటుంబసభ్యులను, సన్నిహితులను తీవ్రంగా కలచివేస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular