నిజం యొక్క పవర్ పదునైన కత్తి కంటే షార్ప్ నెస్ ఎక్కువ..అబద్దం ఎప్పటికప్పుడు విజయం సాధించ వచ్చు నేమో కానీ శాశ్వత విజయం ఎప్పటికీ నిజానిదే..
చత్తీస్ ఘడ్ లో ఓ మహిళా జడ్జిపై కుట్ర చేసి ఆమెను ఉద్యోగం నుంచి తొలగించేలా చేస్తారు. ఆమె మళ్లీ లాయర్ గా మారి తన కేసును తానే వాదించుకుంటుంది. ఆమె ఎంత బలంగా వాదనలు వినిపిస్తారంటే హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఆమెను ఉద్యోగం నుంచి తీసేయడం తప్పని ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. తిరిగి మళ్ళీ జడ్డిగా ఉద్యోగం ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే చత్తీస్ ఘడ్ లోని ఆకాంక్షా భదర్వాజ్ 2013లో న్యాయాధికారిగా ఉద్యోగం సంపాదించుకున్నారు. రాయ్ పూర్లో జడ్జిగా పని చేయడం ప్రారంభించారు. అంబికాపూర్లో పని చేస్తున్న సమయంలో తన కంటే సీనియర్ అనే జడ్జి తనను జ్యూడిషియల్ మేటర్స్ లో గైడెన్స్ పేరుతో పిలిపించి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పై అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలపైఓ కమిటీని నియామకం అయింది. అయితే ఆ కమిటీ ఆకాంక్షా భరద్వాజ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చింది. అదే సమయంలో ఈ కమిటీ ఆకాంక్షను టెర్మినేట్ చేయాలని 2017లో సిఫారసు చేసింది. దాంతో ఆమె ను ఉద్యోగం నుంచి తీసేశారు.
అన్యాయానికి, వేధింపులకు గురయింది తానే అయినా తన ఉద్యోగాన్ని తొలగించడం న్యాయం కాదని ఆకాంక్ష భరద్వాజ్ న్యాయపోరాటం ప్రారంభించారు. తనలో తాను కుమిలిపోతే తాను చేసింది తప్పు అని అందరూ అనుకుంటారని చెప్పి.. ఆమె హైకోర్టులో తన పిటిషన్ తాను దాఖలు చేసుకున్నారు. మళ్లీ లాయర్ గా మారి తన కేసును తాను వాదించుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311ప్రకారం జడ్జిగా తనకు కొన్ని హక్కులు ఉన్నాయని ఇలా తనను తీసేయడం రాజ్యాంగ విరుద్దమని వాదించారు.
మొదట వాదనల తర్వాత హైకోర్టు ఆకాంక్ష భరద్వాజ్ తొలగింపు ఉత్తర్వుల్ని పక్కన పెట్టింది. తర్వాత ఆమె పై నియమితుమైన కమిటీకి ఆమె ను ఉద్యోగం నుంచి తొలగించేలా సిఫారసు చేసే అధికారం లేదని గుర్తించింది. ఆమెను టెర్మినేట్ చేసేందుకు విచారణ బయాస్ చేశారన్నదానికి ఆధారాలు లభించాయి. దీంతో ఆమె టర్మినేషన్ ను రద్దు చేస్తూ హైకోర్టు మరోసారి ఆమెకు పోస్టిగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహాసముంద్ డిస్ట్రిక్ కోర్టులో పోస్టింగ్ ఇచ్చారు. మహిళల జార్జ్ ఆకాంక్ష భరద్వాజ్ చేసిన పోరాటం చత్తీస్ ఘడ్ మహిళా వర్గాల్లో విస్తృతంగా ప్రచారమయింది. ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి న్యాయం తమదే అని నమ్మి నప్పుడు పోరాడి సాధించుకో వాలి అని మహిళా జడ్జ్ గారు నిరూపించారు.