రాచకొండ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠా నుంచి మూడు తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠాగా గుర్తించారు.ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నారు. హైదరాబాదులో తుపాకులు విక్రయించేందుకు ఈ ముఠా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గన్స్ కోసం ఎవరైనా ఈ ముఠాని సంప్రదించారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారా? అని ఆరా తీస్తున్నారు. ముఠా సభ్యులకు తెలిసిన వాళ్ళు ఉండటంతో గన్స్ తీసుకొచ్చింది..
10 బుల్లెట్ లను కూడా రికవరీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ తుపాకులను ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ కు తీసుకువచ్చి వాటిని విక్రయించాలనే ప్రయత్నంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు సమాచారం అందడంతో కొందరు దొరికారు. కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా ను తుపాకుల కోసం నగరంలో ఎవరైనా సంప్రదించారా అనే కోణంలో పోలీసులు రహస్యంగా దర్యాప్తును చేస్తున్నారు. ఈ తుపాకులను తీసుకువచ్చి వాటిని శివారు ప్రాంతాల్లో ఏమైనా పరీక్షించారా అనే విషయం పై కూడా ఆరా తీస్తున్నారు.
ఈ తుపాకుల ముఠా లో బీహార్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల కు చెందిన వారు ఉన్నారని తెలిసింది. వారికి తెలిసిన వారు నగరంలో ఉండడంతో వారి ద్వారా తుపాకుల ను ఈజీగా విక్రయించొచ్చనే ఆలోచనతో ఈ ముఠా తమ వద్ద గన్స్ ఉన్నాయని ప్రచారం చేసుకున్నట్లు వెల్లడవుతుంది. ఈ ముఠా గతంలో ఎవరికైనా, ఎక్కడెక్కడ తుపాకులను విక్రయించారనే విషయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
వారి వద్ద నుండి రెండు తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం..
బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠా గా గుర్తించిన పోలీసులు..
హైదరాబాద్ లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు..
ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్న పోలీసులు..
హైదరాబాద్ లో గన్స్ కోసం ఎవరైనా ఈ ముఠాని సంప్రదించారా అనే కోణంలో దర్యాప్తు..
గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారాఅని ఆరా తీస్తున్న పోలీసులు..




