న్యూస్‌లైన్ తెలుగు (Newsline Telugu) యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు చెలమల శంకర్ (Shankar)పై అంబర్‌పేట్ (Amberpet) పోలీసులు కేసు నమోదు చేశారు.తనపై శంకర్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసినందుకు శంకర్ తనను చంపేస్తానంటూ బెదరిస్తున్నాడని సదరు మహిళ లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు అంబర్‌పేట్ పోలీసులు శంకర్‌పై 69,79,352,351(4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, గత సంవత్సరం ఫిబ్రవరి 22న రాత్రి 10.40 గంటలకు ఎల్‌బీ నగర్ (LB Nagar)లోని కార్యాలయాన్ని మూసి శంకర్ తన తోటి స్నేహితులు నర్సింహ, శివతో కలసి తుర్కయాంజాల్ (Turkyanjal)కు కారులో బయలుదేరారు. అయితే, కొద్ది దూరం ప్రయాణించగానే వారికి ఓ వ్యక్తి అడ్డుగా వచ్చాడు. దీంతో శంకర్ కారును ఒక్కసారిగా ఆపేయగా.. యాక్టివాపై ఇద్దరు యువతులు వెనుక నుంచి కారును ఢీకొట్టారు. దీంతో కారు దిగి శంకర్ యువతులను ప్రశ్నిస్తుండగానే వారు అసభ్య పదజాలంతో వాగ్వాదానికి దిగారు. తప్పు చేసింది మీరే కదా.. అని అంటుండగానే ఆ యువతులకు తెలిసిన కొందరు యువకులు బైకులపై అక్కడకు చేరుకుని శంకర్‌పై రాళ్లతో దాడి చేశారు. ఇందుకు సంబంధించి ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది…ఇదే శంకర్ పై ఓ మహిళా జర్నలిస్టు సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేశారు తన గురించి తెలుసుకోకుండా యూట్యూబ్ ఛానల్ లైవ్ లో అసభ్యంగా మాట్లాడాలని చెప్తున్నా విషయంలో అన్ని సాక్షాదారులతో ఆ మహిళా జర్నలిస్ట్ కేసు నమోదు చేయడం జరిగింది
న్యూస్‌లైన్ నిర్వాహకుడు.. యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు..గతం లో మహిళా జర్నలిస్ట్ గురించి అసభ్యంగా మాట్లాడిన కేసు కూడా ఉంది
RELATED ARTICLES