ఏదైనా సమస్య ఎదురైనపుడు తెలిసిన వాళ్లతో పంచుకుని బాధపడేవాళ్లు. తమకు ఇబ్బంది కలిగించిన విషయాలను కూడా ఆ తెలిసిన వాళ్లతోనే పంచుకునే వారు.కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సోషల్ మీడియా కారణంగా మన జీవితంలో జరిగే విషయాలను నలుగురితో కాదు.. 4 కోట్ల మందితో పంచుకునే అవకాశం ఉంటోంది. చాలా మంది తమ జీవితాలను సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. తమకు ఎదురైన అనుభవాలను అందరితో పంచుకుంటున్నారు. తాజాగా, ఓ యువతి తన జీవితంలో చోటుచేసుకున్న ఓ చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
కొన్నేళ్ళ క్రితం ఓ ఐఏఎస్ అధికారి తనతో తప్పుగా ప్రవర్తించాడని ఆ యువతి అంది. ఈ మేరకు ట్విటర్ ఖాతాలో శనివారం ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘ ఓ ఐఏఎస్ అధికారి ఉండేవాడు. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నపుడు .. అతడు ఎగ్జామ్ క్లియర్ చేశాడు. నేను అతడ్ని గైడెన్స్ ఇవ్వమని అడిగాను. ‘ నువ్వు చాలా హాట్‌గా ఉన్నావు. నిన్ను గైడ్ చేస్తే.. రిటర్న్ గిఫ్ట్‌గా నాకేమిస్తావు ‘అని అడిగాడు. ఇప్పుడతడికి భార్య, ఓ బిడ్డ ఉన్నారు. ఇప్పటికీ అతడి బుద్ధి అలాగే ఉందా? లేక మారిందా? అని ఆలోచిస్తూ ఉన్నాను’అని రాసుకొచ్చింది. ఈ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
