సనాతన ధర్మం కోసం పొరాటం అంటూ వెలుగులోకి వచ్చిన అఘోరీ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.ఇప్పటికే లేడీ ప్రొడ్యూసర్ ను మోసం చేసిన ఘటనలో పోలీసులు అఘోరీశ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. అతను చంచల్ గూడ్ జైలులో రిమాండ్ లో ఉన్నాడు.ఈ క్రమంలో అఘోరీకి సంబంధించి మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
సనాతన ధర్మం పేరుతో అఘోరీ శ్రీనివాస్.. కరీంనగర్ జిల్లా..కొత్తపల్లి కెనాల్ వద్ద మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సదరు మహిళ తరచుగా అఘోరీతో మాట్లాడేది. అయితే.. కొత్తపల్లికి అఘోరీ వచ్చాడు.
ఈ క్రమంలో మహిళను పట్ల అతను నీచంగా ప్రవర్తించాడు. కొత్తపల్లి కెనాల్ వద్దకు తీసుకెళ్లి ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేసిన అఘోరీ శ్రీనివాస్ దారుణంగా ప్రవర్తించాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. తనను బలవంతంగా కొండగట్టు తీసుకెళ్లి మెడకు తాడు కట్టి అత్యాచార యత్నం చేయబోయాడని తన పోలీసులతో చెప్పుకుంది.
బాధితురాలిని బెదిరించి మూడు లక్షలు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తన రాసలీలల అంశం బయటికి చెబితే చంపేస్తానంటూ బాధితురాలని బెదిరించాడని కూడా ఆమె పోలీసులకు చెప్పింది. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు 64(1),87 318(4) 351(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
వెలుగులోకి అఘోరీ మరో రాసలీలలు.. మహిళ ప్రైవేటు పార్ట్స్‌పై చేతులు వేసి మరీ..
RELATED ARTICLES