పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గుహాలయం – నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడి శివయ్యకు మొక్కితే ఎలాంటి సమస్యలు అయినా మటుమాయం అవుతాయని, ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు.దీంతో నిత్యం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నాక.. పార్వతీ దేవికి దర్శించుకుంటారు. అలానే కొత్తగా కొన్న వాహనాలకు పూజలు వంటివి ఇక్కడ చేయిస్తుంటారు.
ఎంతో ప్రాముఖ్యత, చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయం వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంతటి చరిత్ర కలిగిన గుడికి ఎడమ వైపు ఓ రెండు షాపులు ఉన్నాయి. అక్కడ పూజా సామగ్రి అమ్ముతున్నట్లు బయటకు కలరింగ్ ఇస్తున్నారు. లోపల పగలు, రాత్రి తేడా లేకుండా లిక్కర్ అమ్ముతున్నట్లు భక్తులు నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఆలయ పరిసర ప్రాంతాలకు 500 వందల మీటర్ల పరిధిలో మాంసం, మద్యం దుకాణాలు ఉండకూడదు. దీనిపై ఇప్పటికే పలుమార్లు కలెక్టర్, ఎండోమెంట్ అధికారులు సూచనలు చేసినా ఈ దుకాణం వారు మాత్రం పట్టించుకోవడం లేదు.
అయితే ఇంత బహిరంగంగా చర్చ జరుగుతున్నా… చెర్వుగట్టు కొండ కింద ఉన్న పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ వద్ద మద్యం విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని ఎక్సైజ్ అధికారులు చెప్పడం గమనార్హం. మరి మాముళ్ల ఎఫెక్ట్ ఏమైనా ఉందా..? నిజంగానే వారికి సమాచారం లేదా అన్నది తెలియాల్సి ఉంది
గుడి బయట పూజా సామాన్లు అమ్మే కొట్టులా ఉంది కదా.. లోపల అస్సలు యవ్వారం వేరే
RELATED ARTICLES