spot_img
Sunday, July 20, 2025
spot_img

బంగ్లా యవతితో పాక్ హై కమిషనర్ శృంగార లీలలు

ఇండియాలో ఉగ్రదాడులకు పాల్పడి భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్‌ మరో వివాదంలో చిక్కుకుంది. బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్‌ హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న సయ్యద్‌ అహ్మద్‌ మరూఫ్‌ వివాదం లో చిక్కుకున్నాడు.ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ప్రైవేటుగా గడిపిన ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సయ్యద్‌ అహ్మద్‌ హనీట్రాప్‌లో చిక్కుకున్నారన్న వార్తలు గుప్పుమనడంతో పాకిస్థాన్‌ అప్రమత్తమైంది. ఆయనను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించింది.
అయితే ఈ వివాదం బయటకు రాగానే అహ్మద్‌ మరూఫ్‌ మే 11న ఢాకా విడిచి వెళ్లిపోయినట్లు బంగ్లా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయన దుబాయ్‌ మీదుగా ఇస్తామాబాద్‌ చేరుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖకు పాకిస్థాన్‌ హై కమిషన్‌ అధికారికంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరూఫ్‌ స్థానంలో పాక్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆసిఫ్‌ తాత్కాలికంగా హైకమిషనర్‌ బాధ్యతలు చేపట్టారు.

కాగా, మరూఫ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు ఇటీవల నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో అతడు క్లోజ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్‌ అయ్యాయి. ఆమెతో పాక్‌ దౌత్యవేత్తకు సన్నిహిత అనుబంధం ఉందని తెలుస్తుంది. ఆయన ఆ యువతి వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్‌ సదరు యువతికి చేరవేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పాకిస్థాన్ సమగ్ర విచారణకు ఆదేశించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular