spot_img
Thursday, February 5, 2026
spot_img

భర్తతో భార్య శృంగారానికి నిరాకరిస్తే… హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

భార్యభర్తల మధ్య విడాకులకు సంబంధించి న్యాయస్థానాలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ, కీలక తీర్పులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో విడాకుల అంశానికి సంబంధించి తాజాగా బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా… భర్తతో శృంగారానికి నిరాకరించడం క్రూరత్వంతో సమానమని స్పష్టం చేసింది!

అవును… భర్తతో శృంగారానికి నిరాకరించడం, అతడికి వివాహేతర సంబంధాలున్నాయని అనుమానించడం క్రూరత్వంతో సమానమని తాజాగా బాంబే ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విడాకులు పొందేందుకు వీటిని కారణాలుగా పేర్కొనవచ్చని తెలిపింది. కుటుంబ న్యాయస్థానం మంజూరు చేసిన విడాకులను సవాలు చేస్తూ ఓ మహిళ వేసిన పిటిషన్‌ ను తోసిపుచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే… 2013లో వివాహం చేసుకున్న ఓ జంట.. ఆ ఏడాది తర్వాతి నుంచి విడివిడిగా ఉంటోంది. ఈ సమయంలో… శృంగారానికి నిరాకరించడంతోపాటు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తూ తనను వేధిస్తోందని భర్త ఆరోపించాడు. ఇదే సమయంలో.. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగుల ముందు ఇబ్బంది పెడుతూ వేదనకు గురి చేస్తోందని అన్నాడు.

ఈ నేపథ్యంలో తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ 2015లో పుణెలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన పూణె ఫ్యామిలీ కోర్టు.. విడాకులకు అనుమతించింది. దీంతో… ఈ తీర్పును సవాలు చేస్తూ ఆ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా… తనకు నెలకు రూ.లక్ష భరణం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది.

ఇదే సమయంలో… అత్తమామలు మాత్రమే తనను వేధించారని.. భర్తపై తనకు ప్రేమ ఉందని, విడిపోవాలని తాను కోరుకోవడం లేదని పిటిషన్ లో పేర్కొంది. ఈ పిటిషన్‌ ను బాంబే ఉన్నత న్యాయస్థానంలో జస్టిస్‌ రేవతి మోహితే, జస్టిస్‌ నీలా గోఖలేల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా… అతడి స్నేహితులు, తోటి ఉద్యోగులు ముందు ఆమె ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని భావించాల్సి వస్తుందని తెలిపింది. ఇదే సమయంలో.. దివ్యాంగురాలైన భర్త సోదరి, ఆయన కుటుంబీకుల పట్ల ఆమె ప్రవర్తన కూడా అతడి బాధకు కారణాలుగా అభిప్రాయపడింది. ఆ మహిళ పిటిషన్ ను తోసిపుచ్చింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular