spot_img
Monday, March 23, 2026
spot_img

ప్రవర్తన మార్చుకోమని చెప్పిన భర్త.. వినని భార్య.. చివరకు ఎంత ఘోరం జరిగిందో తెలుసా

భార్య ప్రవర్తన భర్తకు నచ్చలేదు.. మార్చుకోమని పలుమార్లు చెప్పాడు.. అయినా.. ఆమె వినలేదు.. దీంతో ఆమె ప్రవర్తన నచ్చక దారుణానికి ఒడిగట్టాడు..భర్త.. భార్యను అతి కిరాతకంగా గొంతుకోసి చంపాడు.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. భార్య ప్రవర్తన నచ్చని భర్త ఆమె గొంతుకోసి హతమార్చాడు.. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.. భార్య ప్రవర్తన నచ్చని భర్త.. ఆమెను హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కోదలమడుగులోని బీసీ కాలనీలో శనివారం జరిగింది.

వివరాల ప్రకారం.. నాలుగేళ్ల క్రితం హరిబాబు – ప్రియాంక (21) లకు పెళ్లి జరిగింది.. ఈ దంపతులకు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కొంతకాలం వరకు ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే.. అనుమానం పెనుభూతంగా మారింది. పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న హరిబాబుకు భార్య ప్రియాంక ప్రవర్తన పట్ల అనుమానం వచ్చింది. అదే గ్రామంలో ఉన్న మరో వ్యక్తితో ప్రియాంకకు వివాహేతర సంబంధం ఉందని భావించిన హరిబాబు.. ప్రవర్తన మార్చుకోవాలంటూ నచ్చజెప్పాడు.. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి.. దీంతో ప్రియాంక పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది..

దీంతో హరిబాబు.. ప్రియాంక దగ్గరకు శుక్రవారం వెళ్లాడు.. ఈ క్రమంలోనే.. శనివారం ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన హరిబాబు.. అక్కడే ఉన్న కత్తి తీసుకుని.. భార్య ప్రియాంకను గొంతు కోసి హత మార్చాడు. అనంతరం బిడ్డను తీసుకుని వెళ్లి.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.. ఘటనా స్థలానికి చేరుకున్న బంగారుపాళ్యం పోలీసులు .. వివరాలు సేకరించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని బంగారుపాళ్యం పోలీసులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular