దేశవ్యాప్తంగా సినిమాల పైరసీ (piracy) ఇండస్ట్రీకి పెద్ద సమస్యగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు (Telangana Cyber Crime Police) దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను పట్టుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాటి సీపీ.. సీవీ ఆనంద్ పైరసీ ముఠాపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఐబొమ్మ అనే వెబ్ సైట్ పై ఫోకస్ చేశామని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని ఈ సందర్భంగా సీవీ ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా ఈ వార్నింగ్ పై ibomma వెబ్‌సైట్ దీటుగా స్పందించింది. ఈ క్రమంలో తన వెబ్ సైట్‌లో ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. సినిమా వాళ్ళ తప్పులని చూపిస్తూ తమపై ఫోకస్ గనక పెడితే మేము ఏం చేయాలో మాకు తెలుసు అంటూ ఐ బొమ్మ పోలీసులకి వారిని ఇచ్చే స్థాయికి వెళ్లిందంటే దాని వెనుక మనం నెట్వర్క్ ఏంటి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఐటీ పెద్దల లేకపోతే బిజినెస్ మెండలా ఎవరి అండ చూసుకొని ఇంత ధైర్యంగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ పోలీసులు దమ్ముంటే వాళ్లకు తెలియదు తెలంగాణ పోలీసులు ఒకసారి సీరియస్ అయితే ఐ బొమ్మ మూలాలు కాదు వాళ్ళు తాత లు ఏ దేశంలో కూడా పట్టుకునే శక్తి ఉన్న దమ్ము తెలంగాణ పోలీసులకు ఉంది.
ఐ బొమ్మ విడుదల చేసిన ప్రకటనలో విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి తాము ఎలాంటి ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్లు అడగబోమని, యూజర్లు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. డుప్లికేట్ యాప్‌లు, నకిలీ వెబ్‌సైట్ల పేరుతో కొందరు మోసాలు చేస్తుండటంతో ఈ హెచ్చరికను జారీ చేసినట్లు తెలిపింది .అలాగే ibomma తన ప్రకటనలో సినిమాలు ఇండస్ట్రీలో పని చేసే వ్యక్తులే తమను దోషులుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. అలాగే, తాము ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు, సబ్‌స్క్రిప్షన్‌లు వసూలు చేయబోమని, తమ సైట్‌లో కేవలం ఉచితంగానే సినిమాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
అలాగే, కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌజ్‌లు, యూట్యూబ్ ఛానల్స్ ఉద్దేశపూర్వకంగా ibomma ని తప్పుగా ప్రచారం చేస్తున్నాయని, తాము ఎలాంటి హ్యాకింగ్ లేదా ఫోన్ ట్రాకింగ్ చేయబోమని మరోసారి హామీ ఇచ్చింది. ibomma పేరు మీద నకిలీ యాప్‌లు, నకిలీ సైట్లు వస్తున్నందున యూజర్లు వాటికి లోనవ్వకూడదని సూచించింది. అలాగే ఐ బొమ్మపై మీరు ఫోకస్ పెడితే.. తాము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేస్తామని ఐబొమ్మ వెబ్ సైట్ ప్రకటించింది. చివరగా, తాము ఒక భారతీయ సైట్ అని, తెలుగు ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉన్నామని ibomma స్పష్టం చేసింది.
అలాగే హీరోల రెమ్యూనరేషన్ (Remuneration), వీదేశి ట్రిప్పులు, జల్సాలు, విదేశాల్లో షూటింగులపై ఐబొమ్మ కీలక ప్రశ్నలను సంధించింది. అనవసర ఖర్చులు, హీరోలకు వందల కోట్లు రెమ్మునరేషన్లు ఇచ్చి.. భారీ బడ్జెట్ చూపించి.. సామాన్య ప్రజలు ప్రేక్షకులపై ఆ ప్రభావం చూపుతున్నారని ఐబొమ్మ మండిపడింది. అలాగే డిస్ట్రిబ్యూటర్లకు సినిమా ప్రింట్ అమ్మిన తరువాత మీరు ఏమీ పట్టనట్లు.. కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ.. మా మీద ఫోకస్ పెట్టారని ప్రొడ్యూసర్లు ఐబొమ్మ నిలదీసింది



