spot_img
Thursday, February 5, 2026
spot_img

ఆ కోరికలు తీర్చుకోవడానికే సహజీవనం.. అందుకే పెళ్లికి దూరం..

తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సీరియల్ నటి శ్రీవాణి. ఇటీవల జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్ షోలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, లివింగ్ రిలేషన్ వంటి అంశాలపై బహిరంగంగా స్పందించారు.రియల్ లైఫ్‌లో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్న శ్రీవాణి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే..?

హైదరాబాద్‌కు చెందిన శ్రీవాణి, తొలుత దర్శకుడు కోదండరామిరెడ్డి రూపొందించిన గొడవ చిత్రంలో చిన్న పాత్ర పోషించి సినీరంగంలో అడుగుపెట్టింది. అనంతరం సినీరంజనీ అనే కార్యక్రమంలో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో టెలివిజన్ అవకాశాలు రావడంతో సంఘర్షణ, కాంచన గంగ, చంద్రముఖి వంటి పాప్యులర్ సీరియల్స్‌లో నటించింది. అలాగే మావిచిగురు, కలవారి కోడళ్లు, రాములమ్మ, తిరుమాంగల్యం వంటి పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెర కుటుంబ ప్రేక్షకుల అభిమానిని అయింది.

ఇటీవల జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం,వివాహం, లివింగ్ రిలేషన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాక్ షోలో పెళ్లిపై ప్రశ్నించగా, శ్రీవాణి సమాధామిస్తూ.. ‘ఈ రోజుల్లో చాలామంది పెళ్లిని తేలికగా తీసుకుంటున్నారని, పెళ్లి ఇప్పుడు అవసరం లేదని భావించే వారు పెళ్లి తర్వాత, ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత తాము పడే కష్టాలు అర్థం చేసుకుంటారని చెప్పారు. “పెళ్లి లైఫ్‌లో తప్పనిసరి. మనకు ఒక తోడు ఉండాలి. వాళ్లు ఎవరో బాగా చూసి, టైం తీసుకుని పెళ్లి చేసుకోవాలి. వెంటనే పిల్లల్ని కనకుండా, రెండు సంవత్సరాల తర్వాత ప్లాన్ చేయాలి. లేదంటే పిల్లలు మధ్య ఉండే గొడవలు వారి భవిష్యత్తుపైనా ప్రభావం చూపుతాయి” అని తెలిపారు.లివింగ్ రిలేషన్‌షిప్‌పై మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు శ్రీవాణి కాస్త సీరియస్ గానే స్పందించారు. “ఇద్దరూ ఒక ఇంట్లో ఉండి కోరికలు తీర్చుకుంటారు. తర్వాత బోర్ వచ్చి విడిపోతారు. అప్పుడు బాధ్యత ఎవరిదీ? ఒకసారి అలవాటు అయితే పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు” అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, “లివింగ్ రిలేషన్‌షిప్ అనేది కేవలం ఫిజికల్ అవసరాల కోసమే కొనసాగుతుందని చాలా మందిలో ఓ అభిప్రాయం ఉంది. భవిష్యత్‌లో పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఇప్పుడే పెళ్లి చేసుకుని బాధ్యతలు పంచుకోవచ్చు’ అంటూ చెప్పారు.లివింగ్ రిలేషన్‌షిప్‌ను ప్రోత్సహించే వారిపై కూడా ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సహజీవనాన్ని సపోర్ట్ చేసే వాళ్లకి బుద్ధి లేదు అంటానని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పటి జెనరేషన్‌లో ఎక్కువ మంది లైఫ్‌లో సెట్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారని, ఈ ఆలోచన ఎప్పుడూ సరైన ఫలితాన్ని ఇవ్వదని అన్నారు. “లైఫ్‌లో ఏం జరగాలో అదే టైంలో జరగాలి. నేను లైఫ్‌లో సెట్ కాకపోయినా పెళ్లి చేసుకున్నా ఇప్పుడీ హాయిగా ఉన్నాను. అసలు సెట్ అయిన తర్వాతనే బాగుంటుందనేది ఎక్కడ రాసి ఉంది?” అంటూ ప్రశ్నించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular