spot_img
Tuesday, February 10, 2026
spot_img

మహిళా పోలీసులపై మీడియా ముసుగులో బ్లాక్‌మెయిల్..! ముగ్గురు మహిళా అధికారుల్ని టార్గెట్ చేసిన కంత్రి గాడు

మహిళా పోలీసులపై మీడియా ముసుగులో బ్లాక్‌మెయిల్..! ముగ్గురు అధికారుల్ని టార్గెట్ చేసిన  రిపోర్టర్‌పై పోలీసుల సీరియస్ యాక్షన్
హైదరాబాద్‌లో సంచలనం రేపుతున్న మరో బ్లాక్‌మెయిల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మీడియా పేరును అడ్డుపెట్టుకుని, మహిళా పోలీస్ అధికారులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తి వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
తాము చెప్పిన మాట వినలేదన్న కారణంతో ముగ్గురు మహిళా పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడించి, ఆ సంభాషణలను తమకు అనుకూలంగా ఎడిట్ చేసి రికార్డ్ చేసుకొని, వాటితో బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు బాధిత అధికారులు కోబ్రా న్యూస్‌కు వెల్లడించారు.
ఈ వ్యవహారం తెలుసుకున్న కోబ్రా న్యూస్, పూర్తి సమాచారాన్ని సేకరించిన అనంతరం, బాధిత మహిళా పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చి, ఈ అంశాన్ని నేరుగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ గారి దృష్టికి తీసుకెళ్లింది.

గతంలోనూ ఇలానే..?
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన వ్యక్తిపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలున్నాయి.
ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా, తనను తాను ‘మీడియా ప్రతినిధి’గా పరిచయం చేసుకుంటూ, ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురిచేసినట్టు ఇప్పటికే కొన్ని శాఖలు ఒక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.
ఈ వ్యవహారంపై ఎస్బీఐ అధికారుల దృష్టికి కూడా విషయం వెళ్లినట్టు, అలాగే ఒక జిల్లా కలెక్టర్‌కు కూడా సమాచారం అందడంతో, అప్పట్లోనే ప్రాథమిక స్థాయి విచారణ జరిగినట్టు తెలుస్తోంది.

ఎవరు ఆ వ్యక్తి? వెనుక ఉన్న శక్తులేంటి?
ప్రస్తుతం పోలీసుల ముందు ఉన్న కీలక ప్రశ్నలు ఇవే:
అసలు బ్లాక్‌మెయిల్ చేసిన వ్యక్తి ఎవరు?
గతంలో ఎక్కడెక్కడ, ఎవరెవరిని ఇదే తరహాలో బెదిరించాడు?
అతని విద్యార్హతలు ఏంటి?
జర్నలిస్టుగా మార్కెట్‌లోకి ఎలా వచ్చాడు?
మీడియా ముసుగులో ఈ స్థాయిలో పోలీసులనే బెదిరించే ధైర్యం వెనుక ఎవరున్నారు?
ఈ అన్ని కోణాల్లోనూ పూర్తి స్థాయి నిఘా పెట్టిన పోలీసు యంత్రాంగం, అతని గత కార్యకలాపాలు, వసూళ్లు, ఆదాయ మార్గాలు అన్నింటినీ లోతుగా పరిశీలిస్తోంది.

ప్రమోలతోనే బెదిరింపులు?
ఈ వ్యవహారాన్ని పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకునేలా చేసిన అంశం మరోటి కూడా ఉంది.
నేరుగా మహిళా పోలీస్ అధికారి పేరుతోనే ప్రమోలు రిలీజ్ చేసి, మీడియా పేరుతో వార్తలు వేయడం, బహిరంగంగా బెదిరించే స్థాయికి వెళ్లడం పోలీసు శాఖను తీవ్రంగా ఆలోచింపజేసింది.
ఒక్కరే కాదు, మొత్తం ముగ్గురు మహిళా పోలీస్ అధికారులను ఇదే తరహాలో టార్గెట్ చేయడంతో, ఇప్పటికే అంతర్గత విచారణ (Internal Enquiry) మొదలైంది.

కఠిన చర్యలు తప్పవు
పోలీసు ఉన్నతాధికారుల స్పష్టమైన హెచ్చరిక:
“మీడియా పేరుతో, ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను బెదిరించే ప్రయత్నాలు చేస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.”
సదరు చానల్ యాజమాన్యం, వారికి ఉన్న అనుమతులు, చానల్ బ్యాగ్రౌండ్, మీడియా రంగంలోకి ఎప్పుడు వచ్చారు, వచ్చిన తర్వాత వారి ఇన్కమ్ సోర్స్ ఏంటి అన్న అన్ని అంశాలపై కూడా పూర్తి స్థాయి ఎంక్వయిరీ జరుగుతోంది.

మీడియా పేరు దుర్వినియోగానికి చెక్
మీడియా అనేది ప్రజలకు నిజమైన, నిర్భయమైన వార్తలను అందించి అప్రమత్తం చేయడానికే కానీ,
“మాకు డబ్బులు ఇవ్వాలి, మేము చెప్పిందే జరగాలి” అన్న బెదిరింపులకు కాదని పోలీసు యంత్రాంగం స్పష్టం చేస్తోంది.
ఈ కేసులో నిందితుడి పూర్తి బ్యాగ్రౌండ్ బయటకు వచ్చాక, కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ స్థాయి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం.
👉 మొత్తం మీద, మీడియా ముసుగులో సాగుతున్న బ్లాక్‌మెయిల్ దందాకు త్వరలోనే తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular