బేగం పేట పరిధిలోని శ్యాంలాల్ బిల్డింగ్ – మార్వెల్ స్కూల్ సమీపంలో ప్రజలకు ఇబ్బందిగా మారుతున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నిత్యం మద్యం మత్తులో అక్కడికి వచ్చి అల్లరి చేస్తూ స్థానికులను, రాకపోకలు సాగించే ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్టు సమాచారం.
ప్రత్యేకంగా మహిళలు ఈ మార్గం గుండా వెళ్లాలంటే భయంతో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని ప్రవర్తన వల్ల పరిసరాల్లో శాంతిభద్రతలు భంగం చెందుతున్నాయని, ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా మార్పు లేకపోవడంతో పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై స్థానికులు Begumpet Police Stationకు ఫిర్యాదు చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
ముఖ్యంగా మహిళలు, పిల్లలు సంచరించే ప్రాంతంలో ఈ తరహా ప్రవర్తన తీవ్ర ప్రమాదకరమని, సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా మహిళలు, పిల్లలు సంచరించే ప్రాంతంలో ఈ తరహా ప్రవర్తన తీవ్ర ప్రమాదకరమని, సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్టు సమాచారం.
బేగంపేటలో నిత్యం మద్యం మత్తులో హంగామా..మహిళలకు భద్రతపై ఆందోళన
RELATED ARTICLES




