spot_img
Sunday, March 29, 2026
spot_img

మహిళా జర్నలిస్టును మాయ చేస్తూ హైదరాబాద్‌లో తిరుగుతున్న మహానగర మాయగాడు..కోటి 50 లక్షలు ముంచేసిన కేటుగాడు

హైదరాబాద్ మహానగరంలో మరో సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. తనను ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుల సన్నిహితుడు, ప్రభావవంతమైన వ్యక్తిగా చెప్పుకుంటూ అమాయకులను లక్ష్యంగా చేసుకున్న ఒక వ్యక్తి శ్రీనివాస్ ఇప్పుడొక భారీ మోసం కేసులో కేంద్రబిందువుగా మారాడు. ముఖ్యంగా మహిళా జర్నలిస్టును టార్గెట్‌గా చేసుకుని అతడు పన్నిన మాయజాలం ఇప్పుడు బయటపడుతోంది.
శ్రీనివాస్ తన గురించి చెప్పుకునే కథలు వినిపిస్తే ఎవరికైనా ఆశ్చర్యమే కలుగుతుంది. తాత రాజంపేట మాజీ ఎమ్మెల్యే అని, కుటుంబం మొత్తం ప్రభావశీలమైన పోస్టుల్లో పనిచేసిందని చెప్పుకుంటాడు. ఎస్వీ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా పని చేసిన తాత, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్న తండ్రి, ప్రముఖ హీరోలతో క్లాస్మేట్ అన్న సంబంధాలు ఇలా ప్రతి ఒక్కరిని మాటలతో బురిడి కొట్టేశాడుఒక పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌ను సృష్టించుకుంటాడు. మంచు మనోజ్, నారా రోహిత్‌లతో చదివానని, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి దగ్గరని, ముఖ్య రాజకీయ నాయకులతో ప్రత్యక్ష పరిచయం ఉందని చెప్పి ఎదుటివారిని ఆకట్టుకుంటాడు.
ఇది మాత్రమే కాదు… తనకు తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఐఏఎస్ అధికారులతో నేరుగా సంబంధాలు ఉన్నాయని చెప్పి నమ్మకాన్ని పెంచుతాడు. ప్రభుత్వ వ్యవస్థలో తనకు గట్టి పట్టుంది, ఫైళ్ళను కదిలించగలను, లంచాలు ఇచ్చి పనులు పూర్తి చేయించగలను అంటూ మాటలు చెబుతాడు.
ఇలాంటి మాటలతో ఒక మహిళా జర్నలిస్టును లక్ష్యంగా తీసుకున్నాడు. తనను తెలంగాణ సెక్రటేరియట్‌లో సీఎంఆర్ఎఫ్ సెక్షన్‌లో పనిచేస్తున్న అధికారిగా పరిచయం చేసుకుని, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వరకు వెళ్లే స్థాయి తనదని చెప్పి నమ్మించాడు. ఎలక్షన్ సమయంలో ఈవీఎంలపై కూడా తనకే నియంత్రణ ఉందని చెప్పి మరింత విశ్వాసం కలిగించాడు.
కొంతకాలానికి ట్రాన్స్ఫర్ అయి త్వరలో ఆర్డీవోగా ప్రమోషన్ వస్తుందని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోసం 50 లక్షలు ఖర్చు చేశానని చెప్పి తన ‘స్థాయి’ను పెంచుకున్నాడు. కానీ అసలు విషయం ఏమిటంటే అతను వాడుకున్న పేరు కూడా నకిలీ అని బయటపడింది.
తన మోసం యొక్క అసలు దశ అక్కడి నుండి ప్రారంభమైంది. శంకర్‌పల్లి ప్రాంతంలో ఉన్న విలువైన భూమిని రిజిస్టర్ చేయిస్తానని చెప్పి భారీ డీల్‌ను ముందుకు తెచ్చాడు. కలెక్టర్ తన అన్నయ్య అని, ఇతరులకంటే తక్కువ ధరలో పని పూర్తి చేస్తానని చెప్పి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడు. మూడు నెలల్లో భూమి మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తానని పదేపదే నమ్మించాడు.
డబ్బులు ఇచ్చిన తర్వాత, నకిలీ డాక్యుమెంట్లు, కలెక్టర్ సంతకం చేసినట్లు కనిపించే పేపర్లు చూపించి నమ్మకాన్ని కొనసాగించాడు. తర్వాత మరో పది లక్షలు అవసరం అని చెప్పి అదనంగా కూడా డబ్బులు తీసుకున్నాడు. ఇలా మొత్తంగా కోటి 50 లక్షలు వసూలు చేశాడు సదరు మహిళా జర్నలిస్ట్ దగ్గర నుంచి..కానీ పని మాత్రం ఎక్కడా ముందుకు జరగలేదు. ఎమ్మార్వో కార్యాలయంలో విచారణ జరిపితే,అన్ని డాక్యుమెంట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని బయటపడింది. ఎక్కడ పోలీసులు దొరక్కుండా ఎవిడెన్స్ లేకుండా మేనేజ్ చేశాడు
ఈ విషయం తెలిసిన తర్వాత కూడా శ్రీనివాస్ తన మాయను ఆపలేదు. మరో భూమి చూపిస్తానని, వివాదాస్పద స్థలాలు చూపిస్తూ కాలం గడిపాడు. ఇప్పటివరకు తీసుకున్న డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు. అంతేకాదు, ప్రశ్నిస్తే జైలుకి వెళ్తాను, బయటికి వచ్చాక మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అంటూ బెదిరింపులకు దిగాడు.
సమాచారం ప్రకారం, ఆ మహిళా జర్నలిస్టు దగ్గర నుంచి సుమారు ఒక కోటి యాభై లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. డబ్బులు తీసుకున్న వెంటనే కారు కొనడం, భారీగా నగలు కొనడం వంటి చర్యలు కూడా అతని మోసం స్థాయిని చూపిస్తున్నాయి. అతనికి సహకరిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఈ మోసంలో భాగమయ్యారని అనుమానాలు ఉన్నాయి.
చివరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ శ్రీనివాస్ మాత్రం చట్టాన్ని కూడా తన ఆటవస్తువుగా భావిస్తూ, అరెస్ట్ అయినా తనకు ఎలాంటి నష్టం ఉండదని సవాలు చేస్తున్నాడు.
ఈ ఘటన మరోసారి నగరంలో జరుగుతున్న తెలివైన మోసాలపై హెచ్చరికగా నిలుస్తోంది. పెద్ద పేర్లు, రాజకీయ సంబంధాలు, ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వచ్చే వ్యక్తులను అంధంగా నమ్మడం ఎంత ప్రమాదకరమో ఈ కేసు స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా మీడియా రంగంలో పనిచేసే మహిళలు కూడా ఈ మాయగాడి వలలో పడటం అతని మోసం ఎంత ప్రణాళికాబద్ధంగా జరిగిందో తెలియజేస్తోంది. ఇతనికి మరో ముగ్గురు కూడా స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితుల వల్లే శ్రీనివాస్ అనే అతను సదరు మహిళా జర్నలిస్టుకు పరిచయం అయ్యాడు సదర్ మహిళా జర్నలిస్ట్ దగ్గర నుంచి కోటి 50 లక్షలు చేసిన తర్వాత డబ్బులు అడిగితే తాను 30 లక్షలు  మాత్రమే తీసుకున్నాను మిగతాయి ఫ్రెండ్స్ తీసుకున్నారని ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు.. చివరికి అందరూ కలిసి  మోసం చేస్తున్నారని తెలిసిన సదరు జర్నలిస్ట్ అతని దగ్గర నుంచి ఎలాగోలా ప్రామిసరీ నోట్లు చెక్కులు తీసుకున్న చాలా తెలివిగా లీగల్ గా ఈ రకంగా తన మీద కేసు కాకుండా ప్రాంసరీ నోటు రాసి ఇచ్చినట్టు ఆ మహిళా జర్నలిస్టు గుర్తించింది..
హైదరాబాద్ మహానగరంలో ఇంకా ఎవరెవరిని ఈ మాయగాడు మోసం చేశాడన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

ఈ సమాచారం మొత్తం అన్ని ఎవిడెన్స్ లతో సమాచారం మొత్తం తెలంగాణ  పోలీసులకు ఇచ్చి మోసపోయిన మహిళా జర్నలిస్ట్ న్యాయం జరిగేలా చూస్తాం.ఇప్పటికైనా సరే ఆ మహిళా జర్నలిస్టుకు న్యాయం చేసి డబ్బులు తిరిగిస్తే సరి లేకపోతే నీకు సంబంధించిన మోసం చేసిన విధానంపై సేకరించిన సాక్ష్యాలన్నీ కూడా తెలంగాణ పోలీసులు ముందు పెట్టి మీలాంటి మాయగాల్ల పనిపట్టేందుకు కోబ్రా న్యూస్ సిద్ధంగా ఉంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular