ఆంధ్రా రియల్ బ్రోకర్ తో కొంతమంది కలెక్టరేట్ ఉద్యోగుల కుమ్మక్కు…..?
కలెక్టర్ల ఫోర్జరీ సంతకాల
తో విలువైన భూములకు, వివాదాస్పద భూములకు ఎన్వోసీ లు జారీ
టైటిల్ ,పాస్ బుక్కులు జారీ పై ఆర్డీవోలు, ఎమ్మార్వోలకు ఉత్తర్వులు ఈ ఫోర్జరీ స్కాంలో జిల్లాలోని పలు ఆర్డిఓ ఎమ్మార్వో పంచాయితీ *సిబ్బంది పాత్ర కీలకమని అనుమానాలు
_హైదరాబాదులో భూములు కొనబోయే వారితో తహసీల్దార్, సీసీఎల్ ఆర్టీవో గా పరిచయమైన బ్రోకర్
_ నకిలీ సేల్ డీడ్లు , కలెక్టర్ల ఉత్తర్వులతో మధ్యతరగతి వర్గాలకు భూముల గాలం
_నకిలీ డాక్యుమెంట్లతో అమరావతి. రైతులను నమ్మించి కోట్ల రూపాయలు కాజేసిన ముఠా
_ బాధితుల్లో సాఫ్ట్ వేర్
ఉద్యోగులు, పలు ప్రైవేట్ కంపెనీల డైరెక్టర్లు, ఉద్యోగులు
కోబ్రా న్యూస్, హైదరాబాద్
“‘ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లుగా ఎంతోమంది ఐఏఎస్ అధికారులు బదలీపై వస్తుంటారు…. పోతుంటారు. కానీ కలెక్టరేట్లోని కలెక్టర్ల నకిలీ సంతకాల ముఠా మాత్రం పర్మనెంట్. ఒక్క మాటలో చెప్పాలంటే …. వాళ్ళు పక్కా లోకల్ . ఎంతమంది కలెక్టర్లు వచ్చినా, పోయినా వారికి బే ఫికర్. కలెక్టర్ల పేరుతో జిల్లాలోని విలువైన భూములకు, వివాదాస్పద భూములకు ఎన్ఓసీలు జారీ చేయడం వారికి చిటికెలో పని. భూ యాజమాన్య హక్కులు, పాస్ బుక్కుల జారీపై పలువురు ఆర్డీవోలు తహసిల్దార్లకు కలెక్టర్ల సంతకాలతో
ఆదేశాలు పంపటం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆంధ్ర రియల్ ఎస్టేట్ బ్రోకర్ రెడ్డిపల్లి నాగ శ్రీనివాస్ తో కలిసి కలెక్టరేట్లోని కొంతమంది అవినీతి ఉద్యోగులు చేస్తున్న సంతకాల స్కామ్ కు పలువురు అమాయకులు బలయ్యారు””
. ఏపీ రాజధాని అమరావతిలో వారసత్వంగా వచ్చిన భూము లు అమ్ముకొని హైదరాబాద్ లో స్థలం కొనుగోలు చేసిన పలువురు మధ్యతరగతి వ్యక్తులు ఈ ముఠా చేతిలో దారుణంగా మోసపోయారు. కోట్ల రూపాయలు పోగొట్టుకొని రోడ్డున పడ్డారు.ఆర్థికంగా చితికి పోయి దుర్భర జీవితం గడుపు తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో అమాయకులను మోసగించిన వ్యవహారంలో ఆంధ్రా రియల్ ఎస్టేట్ బ్రోకర్ రెడ్డిపల్లి నాగ శ్రీనివాస్ ప్రధాన సూత్రధారి కాగా, ఈ ముఠాలోమరో ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రంగారెడ్డి కలెక్టరేట్ లోని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్డీవో, తహసీల్దార్, పంచాయతీ కార్యాలయాల సిబ్బంది కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. రెడ్డిపల్లి నాగ శ్రీనివాస్ ముఠా చేతిలో మోసపోయిన బాధితుల్లో అమరావతి రైతులు, సాప్ట్ వేర్ ఉద్యోగులు, పలువురు ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారనీ సమాచారం.
ఏపీలోని కడప జిల్లా వాసి
ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కడప జిల్లా రాయచోటికి చెందిన వ్యక్తి రెడ్డిపల్లి నాగ శ్రీనివాస్ ఉరఫ్ అనిల్. గత కొంతకాలంగా
హైదరాబాద్ లోని నిజాంపేట ప్రాంతంలో నివసిస్తున్నాడు. తెలంగాణ , ఏపీ లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తున్నాడు. సువర్ణ భూమి సహా పలు రియల్ కంపెనీలకు బ్రోకర్ గా పనిచేస్తున్నాడు. హైదరాబాదులో ఉన్న ఖరీదైన ప్రాంతాల్లో ఓనర్లు అందుబాటులో లేని భూములను జల్లెడ పట్టి వెతుకుతాడు. ఆ భూముల ఓనర్లు ఎవరు, ఎక్కడ ఉంటారనే అంశాలతో పాటు ఆ భూములకు సంబంధించిన సర్వేనెంబర్ల వివరాలను కూడా సేకరిస్తాడు. తరచుగా ఆ భూమి దగ్గరకు వెళ్తూ చుట్టుపక్కల వారి వివరాలు సేకరిస్తాడు. ఆ భూమి డేటాతో మరో ముగ్గురు స్థానిక రియల్ బ్రోకర్లు ఎం రామ కొండల రాజు, ఏ. రవీందర్ రెడ్డి, ఏ ఉమా గణేష్ రెడ్డి లతో కలిసి నకిలీ సేల్ డీడ్ పత్రాలు సృష్టిస్తాడు. ఇక అప్పటి నుండి రెడ్డిపల్లి నాగ శ్రీనివాస్ యాక్షన్ స్టార్ట్ చేస్తాడు.
*మాటల మరాఠీ* …. *తహసీల్దారుగా చలామణీ*
వృత్తి పరంగా
రియల్ బ్రోకర్ కావడం తో రెడ్డిపల్లి నాగ శ్రీనివాస్ మంచి మాటకారి. హై ఎండ్ కారు ల్లో తిరుగుతూ సమాజంలో గొప్పింటి వ్యక్తి గా ముద్ర వేసుకుంటాడు. మంచి ఇంగ్లీష్, హిందీ, తమిళ తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడి ఎదుటి వారిని ఆకట్టు కుంటాడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఎవరికీ చెప్పడు. ఆంధ్రా కేడర్ తహసీల్దార్ అని పరిచయం చేసుకుంటాడు. ఏపీ సి సి ఎల్ విభాగం లో తాసీల్దార్ గా పని చేసి రూ. 50 లక్షలు ఖర్చు చేసి తెలంగాణ సచివాలయంలో సి ఎం ఆర్ ఎఫ్ విభాగానికి ట్రాన్స్ ఫర్ మీద వచ్చానని రీ సెంట్ గా తెలంగాణ సి సి ఎల్ లో ఆర్డీఓ గా ప్రమోట్ అయినట్లు చెబుతాడు. బాస్ నవీన్ మిట్టల్ తనకు చాలా క్లోజ్ అని, తను ఏది అడిగినా చేసి పెడతానని చెబుతాడు.
*ఐ ఏ ఎస్ ఆఫీసర్ సిఫార్సుతో గవర్నమెంట్ జాబ్*
నాగ శ్రీనివాస్ తన ప్రభుత్వ ఉద్యోగం గురించి కూడా పిట్ట కథ చెబుతాడు.తండ్రి రెడ్డిపల్లి శేషగిరి రావు రాయలసీమ లోనే పేరున్న ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అని ఆయనకున్న ఐ ఏ ఎస్ ఆఫీసర్ ఫ్రెండ్ సిఫార్సు తో తహసీల్దార్ ఉద్యోగం వచ్చిందని చెబుతాడు. అమ్మ తరుపు తాత రాజంపేట మాజీ ఎమ్మెల్యే బండారు రత్న సభాపతి అని, తండ్రి వైపు తాత ఎస్వీ యూనివర్సిటీలో రిజిస్టార్ గా పనిచేశాడని గొప్పలు చెబుతాడు. సినిమా హీరో మంచు
మనోజ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు కుమారుడు నారా రోహిత్, హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది తన క్లాస్ మేట్ అని హైప్ ఇస్తాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాళ్ళ బ్రదర్ తిరపతితి రెడ్డి కి చాలా క్లోజ్ అని,మాజీ సీఎం కేసీఆర్ ఐతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తనకు స్వయంగా కోడికూర వడ్డించి భోజనం పెడతాడని చెప్పుకుంటాడు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇంటికి వెళ్లి మరీ డబ్బులు చెర వేసే చనువు ఉందని అవతలి వాళ్ళని మాటలతో బాగా నమ్మిస్తాడు. ఐ ఏ ఎస్ అధికారులు డా. హరీష్, శాంతి కుమారి తనకు బంధువులని రెగ్యులర్ గా వాళ్ళతో ఫోన్లో టచ్ లో ఉంటానని నమ్మిస్తాడు. రియల్ దిగ్గజం మై హోమ్ రామేశ్వర రావు కూడా తనకోసం స్వయంగా సచివాలయానికి వచ్చి కలుస్తాడని బిల్డప్ ఇస్తాడు.
*శంకర్ పల్లి ల్యాండ్ పేరుతో అమాయకుల నుండి కోట్లు దోపిడీ*
తన మాటలకు అవతలి వాళ్ళు పూర్తిగా బుట్టలో పడ్డారని నమ్మకం కుదిరాక మనీ దోపిడీ ప్లాన్ స్కెచ్ స్టార్ట్ చేస్తాడు. ఈ నాగ శ్రీనివాస్ గాలానికి ఏపీ రాజధాని అమరావతి కి చెందిన సామాన్య మధ్య తరగతి కుటుంబం చిక్కింది.
వారసత్వంగా వచ్చిన భూమి అమ్ముకుని హైదరాబాద్ లో చిన్నపాటి స్థలం కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్నాడు. మీ దగ్గర ఉన్న డబ్బులతో మీరే సొంతంగా కొనుక్కుంటే ఏమీ రాదు. సిసిఎల్ఆర్డిఓ గా తనకున్న పరపతితో తక్కువ ధరకు మంచి భూమి ఇప్పిస్తానని నమ్మించాడు. తనతో పాటు కారు లో ఆర్డిఓ ఆఫీస్ కు తాసిల్దార్ ఆఫీస్ లకు తిప్పాడు. ఉన్నతాధికారులతో చనువుగా మాట్లాడుతూ, కింద సిబ్బందిపై దర్పం ప్రదర్శిస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో తనకున్న పలుకుబడిని ప్రదర్శించాడు. శంకర పల్లిలోని సర్వేనెంబర్ 334, 335 లో ఉన్న 5 ఎకరాల 30 గుంటల భూమి కొనుక్కోమని చూపించాడు. ఆ భూమి స్థల యజమాని సత్యనారాయణ మరణించాడని, అతని భార్య కూడా మరణించినట్లు చెప్పాడు. వాళ్లు చనిపోవడానికి కొద్ది రోజుల ముందు రామకొండల రాజు రవీందర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు సత్యనారాయణ వద్ద సేల్ డీల్ చేసుకున్నారని. కానీ పాస్ పుస్తకాల్లో పేరు మార్పిడి జరగకుండానే భార్యాభర్త మరణించడం జరిగిందన్నారు. ఆ దంపతులకు పిల్లలు కూడా లేరని అందువల్ల ఈ ముగ్గురు వ్యక్తులు పాస్ పుస్తకాల్లో పేరు మార్పిడి టైటిల్ కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. అప్పటి కలెక్టర్ డాక్టర్ హరీష్ తనకు అన్న కావడంతో ఆ ముగ్గురు తనని ఈ పని మీద సంప్రదించారని చెప్పాడు. అయితే ఈ పని చేసి పెట్టడానికి వారిని కలెక్టర్ హరీష్ ఎకరానికి 5 కోట్లు అడిగారు అని అంత డబ్బు ఇవ్వలేము గనుక ఆ డబ్బు ఖర్చు పెట్టే పార్టీని చూడాల్సిందిగా కోరారని, దీంతో వారి నుండి తాను కొనుక్కుంటనట్లుగా అగ్రిమెంట్ చేసుకున్నానని చెప్పాడు. కలెక్టర్ తనకు స్వయానా అన్న కావడంతో తనక పని తక్కువ ఖర్చులో అయిపోతుందని చెప్పాడు. ఎకరానికి కోటిన్నర ఖర్చు పెట్టుకుంటే చాలని ప్రస్తుతం తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో మీరు కోటిన్నర పెడితే ఒక ఎకరా 50 సెంట్లు భూమి రిజిస్టర్ చేస్తానని నమ్మించాడు. పని కాక పోతే మూడు నెలల్లో ఆ డబ్బు వడ్డీతో సహా చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. నాగ శ్రీనివాస్ మాటలను పూర్తిగా నమ్మిన ఆ కుటుంబం 2023 అక్టోబర్ 9న నాగ శ్రీనివాసుని పరిచయం చేసిన వ్యక్తులు సుజయ్, నరేంద్ర సమక్షంలో కోటి రూపాయల యాభై లక్షలను ఎర్రటి వీఐపీ బ్యాగ్ లో పెట్టి ఇచ్చారు. డబ్బులు తీసుకున్న మరుసటి రోజున కలెక్టర్ హరీష్ కు శంకర పల్లి పని కోసం కోటిన్నర లంచం ఇచ్చినట్లు చెప్పాడు. ఐతే డబ్బులు ఇచ్చిన వారం రోజుల లోపలే రంగారెడ్డి కలెక్టర్ హరీష్ అక్కడనుండి బదిలీ అయ్యారు. దీంతో కంగారు పడినవారు డబ్బులు వెనక్కి ఇవ్వమని కోరగా, ఎలక్షన్ల సమయంలో ఎప్పుడు ఎవరు బదిలీ అవుతారో తెలియదు కనుక ముందుగానే కలెక్టర్ దగ్గర ఈ భూమికి సంబంధించిన పాస్ బుక్స్ టైటిల్ డీడ్స్ పరిశీలించి, ఎంక్వయిరీ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆర్డీవో, శంకర్పల్లి తహసిల్దార్ కు కలెక్టర్ హరీష్ దగ్గర ఉత్తర్వుల కాపీ తీసుకున్నట్లు చెప్పాడు అంతే కాదు, కలెక్టర్ హరీష్ సంతకంతో ఉన్న ఆర్డర్ కాపీని వారికి చూపించాడు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ పేపర్ అని, ఇది బయటకు వస్తే తనతో పాటు కలెక్టర్ ఉద్యోగం కూడా ఊడిపోతుందని చెప్పాడు. ఎలక్షన్ అయి కొత్త ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఈ పని పూర్తి చేస్తా అన్నాడు.ఆ ఆర్డర్స్ కాపీ చూసినవారు నిజమే అనుకొని కొద్ది రోజులు మిన్నకుండిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతను ఈ ల్యాండ్ విషయంలో ఏమీ చెప్పలేదు. దీనిపై శ్రీనివాస్ ను ప్రశ్నించగా పని పూర్తి కావాలంటే ఆర్డిఓ, తహసిల్దారు, సర్వేయ రు, పంచాయతీ సర్పంచి, కలెక్టరేట్ సిబ్బంది ఇంకొక కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారని చెప్పాడు. మిగిలిన డబ్బులు ఇస్తే తప్ప పని పూర్తి కాదని ముందు కట్టిన కోటిన్నర కూడా వెనక్కి రావని బెదిరించాడు. దీంతో భయపడిన వాళ్లు ఒకసాయి 40,మరోసారి 70 లక్షలు శ్రీనివాస్ కు ఇచ్చారు. ఆ డబ్బుల్లో ఆర్డీవో కి 25 లక్షలు, 15 లక్షలు శంకరపల్లి తాసిల్దార్ కి ఇచ్చానని, సర్వేయర్ కి 10 లక్షలు, శంకర్పల్లి సర్పంచ్ కి 10 లక్షలు, కలెక్టర్ ఆఫీస్ లో ఈ ఫైల్ మూవ్ కావడానికి ఐదు లక్షలు ఇచ్చినట్లు చెప్పాడు . కొద్ది రోజులకి పని పూర్తయిందని రామ కొండల రాజు రవీందర్ రెడ్డి , ఉ మా శంకర్ రెడ్డి లకు పాస్ బుక్ లో పేర్లు ఎక్కించి, టైటిల్ డిడ్ ఇవ్వమని కలెక్టర్ శశాంక్ ఉత్తర్వులు జారీ చేశారనీ ఆ కాపీని చూపించాడు. అది కూడా చాలా కాన్ఫిడెన్షియల్ పేపర్ అని తన పరపతితో ఆ పేపర్ బయటకు తీసుకుని వచ్చి మీకు చూపిస్తున్నానని చెప్పాడు., ఆ ముగ్గురి పేరుతో పాస్ బుక్కులు వచ్చిన వెంటనే డైరెక్ట్ గా మీ పేరు మీదే రిజిస్ట్రేషన్ కి చేయిస్తానని, అందుకయ్యే అయ్యే ఖర్చులకు డబ్బులు చూసుకోవాలని చెప్పి మరో 10 లక్షలు తీసుకున్నాడు. కానీ, పాస్ బుక్కులు ప్రింట్ కావట్లేదు లేట్ అవుతుందని చాలా రోజులు గడిపేసాడు వీళ్లతో మాట్లాడటం పూర్తిగా తగ్గించేసాడు. కొద్దిరోజులకు నాగ శ్రీనివాస్ మోసం అర్థమై వారు ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చాడు.
పోలీసు ల మీదే రివర్స్ కేసు పెడతా
మోసపోయిన బాధితులు శ్రీనివాసుని తిరిగి డబ్బులు ఇవ్వాలని ప్రాధేయ పడగా, అతను చాలా దురుసుగా ప్రవర్తించాడు. తాను రాశి ఇచ్చిన అగ్రిమెంట్ కాపీ చెల్లదని ఏం చేస్తారో చేసుకోమని బెదిరించాడు. ఎవరికి చెప్పినా ఒక్క రూపాయి కూడా ఇవ్వనని గట్టిగా మాట్లాడితే భూమి మీద లేకుండా చేస్తానని బెదిరించాడు. తన పైన కేసులు పెడితే పోలీసుల మీదే రివర్స్ కేసులు పెడతానని బెదిరించాడు, హైదరాబాద్ లో గానీ, ఆంధ్రా లో కానీ బతికి ఉండాలంటే తనకు ఇచ్చిన రెండు కోట్ల 40 లక్షల సంగతి మార్చి పోవాలని, కాదని పోలీసులకు చెప్పినా ప్రాణాలతో ఉండరని బెదిరించాడు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర వెళ్లి పైసా ఇచ్చే పని లేకుండా సెటిల్ చేసుకుంటానని, అవసరమైతే మీ పైన దొంగ కేసులు కూడా పెట్టిస్తానని భయ పెట్టాడు. దీంతో భయపడిన ఆ కుటుంబం మీడియాను ఆశ్రయించింది. నకిలీ కలెక్టర్ల సంతకాలు, నకిలీ సేల్ డీడ్ పత్రాలతో మోసపోయామని,ఆ ముఠా బారి నుండి తమని కాపాడి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నగర కమిషనర్ సజ్జనార్ కు విజ్ఞప్తి చేసింది. సజ్జన్నార్ గారు కేసును మధుర నగర్ పోలీస్ లకు దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదే కాదు ఇదే ల్యాండ్ అమ్ముతున్నాం అంటూ గతం లో శంకర్ పల్లి పోలీసులు ఓ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అప్పుడు శ్రీనివాస్ తప్పించుకొని మళ్ళీ అదే రకమైన మోసానికి పాల్పడ్డాడు ఈ గ్యాంగ్ అంతేకాకుండా ఇదే శంకర్ పల్లి పొలం కోసం నాగ శ్రీనివాస్ కు కోట్ల రూపాయలు ఇచ్చి మోస పోయిన సాప్ట్ వేర్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారనీ తెలిపింది. ఈ నకిలీ ముఠా కు,వారికి సహకరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులును కటినంగా శిక్షించాలని భాదితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..







