spot_img
Sunday, September 13, 2026
spot_img

అబ్దుల్లాపూర్‌మెట్‌ లో అనుమానంతో తల నరికిన భర్త

అనుమానంతో పాటు కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్యచేశాడు. తల, మొండెం వేరు చేశాడు. ఈ దుర్ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌బీనగర్‌కు చెందిన విజయ్‌కుమార్‌, పుష్పవతి (41) దంపతులు. వీరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో రెండు నెలల క్రితం పుష్పవతి తన కూతురుతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జేన్‌ఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ 5/13 బ్లాక్‌లో నివాసముంటోంది.

తన కుమారుడు, తల్లిదండ్రులతో కలిసి ఎల్‌బీనగర్‌లో ఉంటున్న విజయ్‌కుమార్‌ అప్పుడప్పుడు భార్య, కూతురు వద్దకు వస్తుండేవాడు. ఈ క్రమంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ కాలనీకి ఆనుకుని.. ప్రభుత్వం నిర్మించిన నూతన భవన సముదాయంలోని 66/7 బ్లాక్‌లో తన సోదరికి ఇల్లు వచ్చిందని భార్యకు చెప్పాడు. ఆ ఇంటిని శుభ్రం చేసి వద్దామంటూ మంగళవారం పుష్పవతి వద్దకు చేరుకున్నాడు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ముందస్తు పథకం ప్రకారమే వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా తల, మొండెం వేరుచేసి పరారయ్యాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular