spot_img
Saturday, September 19, 2026
spot_img

అమ్మాయిలతో ఎఫైర్స్.. భార్య విడాకులు.. బిగ్ బాస్ నాగ మణికంఠ ? ఏది నిజం

బిగ్ బాస్ 8 షో లకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నాగమణికంఠ ఎంత ఫేమస్ అయిపోయారో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈయన పల్లవి ప్రశాంత్ లాగా టైటిల్ విన్నర్ అవుతారని ఎంతోమంది కలలు కన్నారు.వారి ఆశలన్ని అడియాశలు చేసి బయటికి వచ్చేసారు. అయితే నాగ మణికంఠ అన్నింటిని ఓర్చుకొని గనుక హౌస్ లో ఉంటే కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచేవారు.కానీ నాగమణికంఠ మధ్యలోనే వచ్చేశారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక నాగమణికంఠ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూసి ఆయన కూడా షాక్ అయ్యారు.మణికంఠ బయటికి రావడంతోనే చాలామంది యూట్యూబర్ లు ఆయనతో ఇంటర్వ్యూలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు. అలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎన్నో సంచలన విషయాలు బయట పెట్టారు. అయితే గత కొద్ది రోజులుగా నాగమణికంఠ భార్యకు విడాకులు ఇస్తున్నాడు అనే వార్తలు కూడా తెరపడింది.ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ మీ భార్య మీకు విడాకులు ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. గే అని తెలిసే మీ భార్య మీకు దూరంగా ఉందని అంటున్నారు.నిజమేనా అని అంటే అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు.అలాగే మేమిద్దరం విడాకులు తీసుకునే స్టేజి వరకు వెళ్ళలేదు. కేవలం చిన్న చిన్న గొడవలు మాత్రమే. నేను డిపెండింగ్ వీసా మీద అమెరికా వెళ్లాను. కానీ అక్కడికి వెళ్ళాక సంవత్సరం న్నర దాటినా వీసా రాకపోవడంతో నేను నా భార్య సంపాదన మీద ఆధార పడడంతో ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి. ఇక గొడవలతో నా భార్య నన్ను ఇండియాకి వెళ్లి నువ్వేంటో నిరూపించుకో అని చెప్పింది.అందుకే ఇక్కడికి వచ్చేసాను.ఇక మా ఇద్దరికి గొడవలు రావడానికి కారణం కూడా నేను పెళ్లి కాకముందు పెట్టుకున్న ఎఫైర్స్ గురించి ఆమెకు చెప్పడమే. నా ఎఫైర్స్ గురించి చెప్పడంతో ప్రియ పెళ్లి అయ్యాక మూడు నెలలకు నాతో చాలా విషయాల్లో గొడవలు పెట్టుకుంది.కానీ ప్రియా చాలా మంచిది. మా విడాకుల వార్తల్లో ఇలాంటి నిజం లేదు. నేను బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక కూడా ప్రియా నాకు ఫోన్ చేసి చాలా ప్రేమగా మాట్లాడింది అంటూ నాగమణికంఠ తెలియజేశారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular