spot_img
Thursday, August 6, 2026
spot_img

ఒక్కసారి ఆల్ఫాజోలెంకు అలవాటు పడితే మానుకోలేరు: సందీప్ శాండిల్య

కల్తీ కల్లు తయారీ కోసం ఉపయోగించే ఆల్ఫాజోలెంను అరికట్టటానికి పకడ్భంధీ చర్యలు తీసుకోనున్నట్టు తెలంగాణ యాంటీ నార్కొటిక్బ్యూరో డైరెక్టర్ సందీప్శాండిల్య తెలిపారు.

ప్రమాదకరమైన ఈ ఆల్ఫాజోలెం కలిపిన కల్లును సేవించటం వల్ల తాగిన వారు క్రమంగా మృత్యు ముఖానికి చేరుకుంటారన్నారు. కొంతమంది వ్యక్తులు రాష్ర్టవ్యాప్తంగా నెట్వర్క్ఏర్పాటు చేసుకుని ఆల్ఫాజోలెం దందా కొనసాగిస్తున్నారన్నారు. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయటానికి డ్రగ్కంట్రోల్, ఎక్సయిజ్శాఖలతో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు తెలిపారు. సాధారణంగా బెన్జోయల్, సైనేడ్తదితర ముడి పదార్థాలను ఉపయోగించి ఈ ఆల్పాజోలెంను తయారు చేస్తారని చెప్పారు.

కల్తీ కల్లు తయారీలో ప్రధానంగా దీనిని ఉపయోగిస్తారని పేర్కొన్న సందీప్శాండిల్య ఒక్కసారి దీనికి అలవాటు పడ్డవారు మానుకోలేరన్నారు. మానేయాలని ప్రయత్నించినా విత్డ్రా సింప్టమ్స్చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. కొంతకాలం క్రితం హైదరాబాద్‌లోని వేర్వేరు చోట్ల ఉన్న 66 కల్లు కంపౌండ్లపై దాడులు జరిపి శాంపిల్స్సేకరించినపుడు కల్లులో ప్రమాదకరమైన ఈ ఆల్ఫాజోలెంను కలుపుతున్నట్టుగా వెల్లడైందన్నారు. ఈ క్రమంలో ఆయా కల్లు కంపౌండ్ల నిర్వాహకులపై కేసులు పెట్టినట్టు తెలియచేశారు. మార్కెట్లో తేలికగా దొరుకుతూ జనం ప్రాణాలను తీస్తున్న ఆల్ఫాజోలెంపై ఇక ముందు మరింత దృష్టిని కేంద్రీకరిస్తామన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular