హైదరాబాద్‌లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతిని నమ్మి పబ్‌కు వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి భారీ బిల్లు ఎదురైన ఘటన కలకలం రేపుతోంది. కూకట్‌పల్లికి చెందిన 27 ఏళ్ల యువకుడికి డేటింగ్ యాప్‌లో ‘దివ్య’ పేరుతో ఓ యువతి పరిచయమైంది. కొంతకాలం ఆన్‌లైన్‌లో చాటింగ్ చేసిన అనంతరం సెప్టెంబర్ 28న ఇద్దరూ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ‘36 కెమిస్ట్రీ పబ్’కు వెళ్లినట్లు సమాచారం.
పబ్‌లో యువతి జ్యూస్, కొన్ని ఆహార పదార్థాలు ఆర్డర్ చేయగా, యువకుడు ఒక బీరు మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే చివర్లో వచ్చిన బిల్లును చూసి యువకుడు షాక్‌కు గురయ్యాడు. మొత్తం బిల్లు రూ.29,884గా ఉండటంతో దీనిపై అతడు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సమయంలో పబ్‌లోని బౌన్సర్లు తనను చుట్టుముట్టారని, తనతో వచ్చిన యువతి కూడా ఓ నకిలీ లావాదేవీ చూపించి అక్కడి నుంచి వెళ్లిపోయిందని యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, డేటింగ్ యాప్‌ల ద్వారా యువకులను పరిచయం చేసుకుని పబ్‌లకు తీసుకెళ్లి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని సదరు పబ్‌లో గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. యువతులను పరిచయం చేయడం నుంచి పబ్‌లో భారీ బిల్లులు వేయడం వరకు ఎవరి పాత్ర ఎంత ఉందనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
డేటింగ్ యాప్‌లలో పరిచయమైన వ్యక్తులను నేరుగా కలిసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా కొత్తగా పరిచయమైన వ్యక్తులు సూచించే పబ్‌లు, రెస్టారెంట్లకు వెళ్లే ముందు వాటి వివరాలు, ధరలు, బిల్లింగ్ విధానం వంటి అంశాలను పరిశీలించాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పదంగా అధిక బిల్లు వసూలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.
డేటింగ్ యాప్ పరిచయం.. పబ్‌లో రూ.29,884 బిల్లు.. హైదరాబాద్‌లో యువకుడికి షాక్
RELATED ARTICLES




