spot_img
Wednesday, June 24, 2026
spot_img

మంచిర్యాలలో మానవ అవయవాల అక్రమ రవాణా..!!!

బ్రెయిన్ డెడ్ పేషంట్ అవయవాలు అమ్ముకున్న డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్‌పల్లికి చెందిన రేవెల్లి శ్రీకాంత్(35) ఆక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్‌కి గురవ్వగా కరీంనగర్ ఆస్పత్రిలో డాక్టర్లు హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పారు.

ఆ ఆస్పత్రిలో ఒక అంబులెన్స్ డ్రైవర్ కామినేనిలో తక్కువ ఖర్చు అవుతాయని తీసుకెళ్లి.. ఎన్ని రోజులు ఉన్నా డబ్బులు ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదు.. అతని అవయవాలు దానం చేస్తే పుణ్యం వస్తుందని శ్రీకాంత్ భార్యను ఒప్పించాడు.

అలాగే ఇన్ని రోజుల హాస్పిటల్ బిల్లు కట్టాల్సిన పని లేదు. పైగా అవయవాలు ఇస్తే రూ. 3 లక్షలు ఇస్తామని శ్రీకాంత్ భార్యకు చెప్పి.. అతని అవయవాలు జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా డాక్టర్లు, ఆ అంబులెన్స్ డ్రైవర్ లక్షల్లో అమ్ముకున్నారు.

విషయం తెలుసుకున్న శ్రీకాంత్ భార్య మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా లక్షల్లో చేతులు మారాయని ప్రాథమిక విచారణలో తేలింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular